-పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.టి.ఆర్.జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలయిన ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ పరిదిలోని నిమ్రా మరియు నోవా కళాశాలల యందు ది.04.06.2024 తేదిన జరుగు ఎన్నికల కౌంటింగ్ ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అన్ని శాఖల సమన్వయంతో పారదర్శక మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేదుకు ఏర్పాటు చేయు చేయు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లపై పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లపై ఈ రోజు పోలీస్ కమీషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్. వారి కార్యాలయం నందు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలను అందించడం జరిగింది.
ఈ నేపధ్యంలో పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ….. కౌంటింగ్ కేంద్రాలు మరియు పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను, పార్కింగ్ ప్రదేశాలు మొదలగు వివరాలపై పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించి, కౌంటింగ్ కేంద్రాల లోనికి ఎవరిని అనుమతించాలి, ఎటువంటి వస్తువులను లోనికి వెళ్ళకుండా క్షుణ్ణంగా తనిఖీ చేసే విధంగా పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లపై, అక్కడ నుండి ఏ విధంగా వారికి నియమించిన స్థానాలకు ఎలా చేరుకోవాలి, బందోబస్తు ఏర్పాట్లలో ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మరియు సిబ్బందికి ఆదేశాలు జారీచేయడంతో పాటు, తగు సూచనలను అందించడం జరిగింది.
అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా సమర్ధవంతముగా విధులు నిర్వర్తించాలని, జిల్లాలోని ముఖ్య ప్రదేశాలలో పికేట్లను ఏర్పాటు చేయడం, వాటిని పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలనీ పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఫలితాలు వచ్చిన అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించి తగు సూచనలను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్., డి.సి.పి.లు కె.శ్రీనివాసరావు ఐ.పి.ఎస్., అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్., టి.హరికృష్ణ, కె.చక్రవర్తి, ఏ.డి.సి.పి.లు ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News