Breaking News

ఈవిఎం స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లను, కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శనివారం సాయంత్రం సదరు స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లు 24X7 అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూం నందు ఈవిఎం లను పరిశీలించారు. సందర్శకుల రిజిష్టర్ నందు సంతకాలు చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు నేపథ్యంలో పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారిని అదితి సింగ్, చంద్రముని, తదితర సంబంధిత అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *