Breaking News

ప్రశాంత వాతావరణంలో ముగిసిన యు పి ఎస్ సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు- 2024

-ఉదయం 49.44 శాతం , మధ్యాహ్నం 49.31 శాతం హాజరు: జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి ఆదివారం జరిగిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ- 2024 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆదివారము ఉదయం 9:30 నుండి 11:30 మధ్యాహ్నం 2:30 నుండి 4:30 గంటల వరకు రెండు సెషన్ల లో పరీక్ష నిర్వహణ జరిగిందనీ, తిరుపతిలో నిర్వహించిన 11 పరీక్షా కేంద్రాల లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు 5518 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం 2728 మంది 49.44 శాతంగా, మధ్యాహ్నం 2721 మంది 49.31 శాతంగా హాజరయ్యారని తెలిపారు. పరీక్ష పత్రాలను స్ట్రాంగ్ రూమ్ నుండి బందోబస్తు నడుమ సంబంధిత పరీక్ష కేంద్రాలకు తరలించడం జరిగిందని, అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని తెలిపారు. కేంద్ర యుపిఎస్సి నిబంధనల మేరకు అన్ని విధాల పకడ్బందీ చర్యలు చేపట్టి పరీక్షలు నిర్వహించామని, అన్ని శాఖల సమన్వయంతో సదరు పరీక్షల నిర్వహణ విజయవంతమైందని కలెక్టర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *