Breaking News

ప్రభుత్వం ప్రాధాన్యత పథకాల, ప్రయోజనాన్ని ప్రత్యేక కార్యాచరణతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేర్చే భాద్యత అధికారులపై ఉంది

-ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్,మే,జూన్ మాశాలకు 3వేలు కలుపుకొని..
-జూలై 1 తేదీన రు.7 వేల రూపాయలు లబ్ధిదారులు పెన్షన్ అందజేయనున్నాం.
-ఉండ్రాజవరం మండల. స్థాయి సమీక్ష లో పాల్గొన్న….
-రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా  అధికారులు  సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీ సుధీంద్ర బాబు ధార్మిక ట్రస్ట్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన  మండల స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల తీరుపై మండల స్థాయి అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల  దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాల మవేమేరకు క్షేత్రస్థాయిలో  చేపట్టవలసిన పనులను నెల రోజులు ముందుగానే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని పనులు చేసేందుకు అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. ప్రతినెల నిర్వహించే సమీక్ష సమావేశంలో గత మాసంలో చేసిన పనులు ఎ మేరకు అయినవి రాబోయే మాసంలో ఏయే పనులను చేపట్టాలనే లక్ష్యంతో అధికారులు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ దిశగా లక్ష్యసాధన చేయాలన్నారు.

ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ  ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత మనపై ఉందన్నారు. విద్యా కిట్స్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిర్ణయంతో అందించడం జరుగుతుందన్నారు.  ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు విద్యా కిట్స్ ను మంత్రి అందజేశారు ఒక భావజాలానికి అలవాటు పడిన అధికారులు, ఉద్యోగులు అది విడనాడి ప్రస్తుత ప్రభుత్వం అందించే విధి విధానాలు ద్వారా  క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అమలు అందించాలన్నారు.

జులై మాసం నుండి  అర్హులైన వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షనర్లు అందరికీ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు  జులై మాసం  నుంచి రు. 4 వేల రూపాయలు, గత ఏప్రిల్ నుండి మూడు మాసములకు ఒక్కొక్క వెయ్యి చొప్పున  మొత్తం రు. 7 వేల రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వపై ఆర్థిక భారం  పెద్ద మొత్తం లో పడినప్పటికీ లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్స్ అందించడం మంచి నిర్ణయం అన్నారు.  క్షేత్రస్థాయిలో   సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.  ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మండలంలో అమలు వ్యవసాయం, ఇరిగేషన్, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, సంక్షేమ పథకాలు, వివిధ రకాల. పింఛన్లు అమలు పై సమీక్షించారు.

ఈ సమీక్ష సమావేశంలో  మాజీ శాసన సభ్యులు బూరుగుపల్లి శేషారావు, తహసిల్దార్, కె.నవీన్ కుమార్ ,ఎండిఓ కే.నరేంద్రరెడ్డి,ఈఓఆర్డి జెడివి ప్రసాద్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కే శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొ న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *