– చిన్న పత్రికలకు కేంద్ర ప్రభుత్వ ప్రకటనలివ్వండి
– ఎంపీ పురంధ్రీశ్వరికి నిమ్మరాజు వినతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా కష్టకాలంలో రద్దయిన పాత్రికేయుల రైల్వే పాసుల పునరుద్ధరణకు కేంద్రంలో మీవంతుగా కృషి చేయాలని సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా లోక్సభలో ప్రమాణ స్వీకారం అనంతరం ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరిని శుక్రవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. సరైన ఆదాయ వనరులు లేక రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పత్రికలనేకం కొట్టుమిట్టాడుతున్నాయని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. చిన్న, మధ్య తరహా పత్రికల మనుగడ కోసం ముఖ్యమైన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు జారీ చేసేలా చూడాలని ఎంపీ పురంధ్రీశ్వరిని నిమ్మరాజు కోరారు.
Prajavartha Online Telugu News