విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం మున్సిపాలిటీలోని బీసీ సంక్షేమ శాఖ బాలుర హస్టల్ ను బిసి సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హస్టల్ లో పిల్లలు విశ్రాంతి తీసుకునే గదులతో పాటు వంటగది, బాత్ రూంల పరిశుభ్రతను పరిశీలించారు. హస్టల్ మెనులో వడ్డించే ఆహారం ఎలా ఉందో చెప్పాలని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే సమస్యపరిష్కరిస్తానని చెప్పగా అలాంటి సమస్యలు ఏమీ లేవని విద్యార్థులు మంత్రికి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాలను 8వ, 9వ తరగతలకు అదనంగా సెక్షన్ ను ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ కోరగా వచ్చే వెనువెంటనే అదనపు సెక్షన్ లను మంత్రి ప్రకటించారు.
Prajavartha Online Telugu News