Breaking News

అవుట్ ఫాల్ డ్రైన్ రైల్వే క్రాసింగ్ కు వేగంగా చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సుధీర్ఘకాలం నుండి పరిష్కారం కాకుండా ఉన్నమొండిగేటు వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ రైల్వే క్రాసింగ్ కు వేగంగా చర్యలు తీసుకోవడానికి జిఎంసితో పాటు రైల్వే అధికారులు కూడా మరింత దృష్టి సారించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ మహ్మద్ నసీర్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక పాత గుంటూరు దగ్గరలోని మొండి గేటు రైల్వే ట్రాక్ వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ క్రాసింగ్ అంశంపై జిఎంసి ఇంజీరింగ్, రైల్వే డివిజనల్ ఇంజనీర్ల తో ఎంఎల్ఏ సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎంఎల్ఏ నసీర్ మాట్లాడుతూ పాత గుంటూరు పరిధిలోని మొండి గేటు వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ రైల్వే ట్రాక్ క్రాస్ వద్ద షుమారు 30 ఏళ్ల నుండి సమస్యగా ఉందని, నగరంలో నుండి 4 మీటర్ల అవుట్ ఫాల్ డ్రైన్ నుండి వచ్చే మురుగు లేదా వర్షం నీరు ట్రాక్ కింద కేవలం 1.5 మాత్రమే ఉన్న వెంట్ నుండి వెళ్లడం వలన నీరు పూర్తి స్థాయిలో బెయిల్ అవుట్ కాక పాత గుంటూరులోని పలు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. దీని వలన పలు కాలనీల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, రైల్వే ట్రాక్ మునిగి రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కల్గుతుందన్నారు. కనుక నగరపాలక సంస్థతో పాటు రైల్వే అధికారులు కూడా సమస్య పరిష్కారానికి మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వే నుండి సమావేశంకు హాజరైన డివిజనల్ ఇంజినీర్ తమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీవ్రతను వివరించాలన్నారు. నగరపాలక సంస్థ నుండి కూడా రైల్వే అధికారులు తగిన వివరాలతో లేఖలు రాయాలని, కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్ర శేఖర్ దృష్టికి కూడా తీసుకెళ్లతామని తెలిపారు. తదుపరి సమావేశం నాటికి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట ప్రతిపాదనలు, టైం లైన్ కార్యాచరణ సిద్దం అయ్యేలా రైల్వే, జిఎంసి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో జిఎంసి ఎస్ఈ శ్యాం సుందర్, ఈఈ కోటేశ్వరరావు, రైల్వే డివిజినల్ ఇంజినీర్ సుదర్శనరెడ్డి, జిఎంసి డిఈఈ శ్రీధర్, ఏఈ సునీల్ కుమార్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *