Breaking News

ప్ర‌జా భ‌వ‌న్‌లో బోనాల సంబురాలు…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాఢ‌ మాసం సందర్భంగా ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాల‌ను ఘనంగా నిర్వహిసున్నారు. అయితే.. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుదిల్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి సీఎం, డిప్యూటీ సీఎం బోనం సమర్పించుకున్నారు. అనంతరం ప్రజా భవన్ నుంచి.. అబ్దుల్లాపూర్ మెట్‌కు సీఎం రేవంత్ బయలుదేరి వెళ్లారు. కాటమయ్య రక్ష పథకానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం శ్రీకారం చుట్టనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *