-నగర ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత రెండు రోజులుగా వర్షం నిరంతరాయంగా పడుతున్న సందర్భంగా నగరంలో వర్షం వల్ల రోడ్ల పైన నీటి నిల్వలు తీసుకున్న చర్యలు పరిశీలించడానికి విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ఆదివారం నాడు తన పర్యటనలో భాగంగా సర్కిల్ 3 పరిధిలోని 16 డివిజన్ పోలీస్ కాలనీ రిటైనింగ్ వాల్ ఏరియా, సర్కిల్ 2 పరిధిలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం, సర్కిల్ వన్ పరిధిలో ఉన్న నిజాంగేట్, ఓల్డ్ సిటీ ఏరియా, కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏరియా, పంజాసంటర్, వన్ టౌన్, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా సర్కిల్ త్రీ పరిధిలోని 16వ డివిజన్ పోలీస్ కాలనీ రోడ్డు చివరన రిటైనింగ్ వాల్ సమీపంలో నిండి ఉన్న వర్షపు నీటి నిల్వలను తక్షణమే పరిశుభ్రపరచడమే కాకుండా నీటి నిల్వ ఉండకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
తదుపరి 33 వ డివిజన్ సత్యనారాయణపురం, ఆంధ్రరత్న మున్సిపల్ పార్క్ ప్రాంతంలో పరిశుద్ధ నిర్వహణ సరిగ్గా లేకపోవడం గమనించి ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని మందలించి తక్షణమే శుభ్రపరచాలని ఆదేశాలు ఇచ్చారు. ఎప్పుడు వర్షం పడిన 33వ డివిజన్లో కుక్కల కారణాలు అధికారుల ద్వారా తెలుసుకోవడమే కాకుండా ఆ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. సర్కిల్ 1 పరిధిలో ఉన్న ప్రాంతాలన్నిటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్ల పైన నిల్వ ఉన్న వర్షపు నీరు ఔట్ ఫాల్ డ్రైనలలో ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్లిపోయేటట్టు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలని అన్నారు.
తను పర్యటించిన ప్రాంతాలలో పలుచోట్ల డంపర్ బీన్ లో గల వ్యర్ధాలను తీయకపోవటం గమనించి అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లను తమ తమ ఫీల్డ్ స్టాఫ్ కు వెంటనే ఆదేశాలిచ్చి ఎక్కడ వ్యర్ధాలు లేకుండా, వ్యర్థల సేకరణ ఖచ్చితంగా జరిగేటట్టు పర్యవేక్షించాలని ఆదేశాలించారు. మరోవైపు పారిశుద్ధ నిర్వహణ కూడా పక్కగా జరగాలని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వటమే కాకుండా విధుల్లోని అలసత్వం నిర్వహిస్తే ఖఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News