Breaking News

పిడింగోయి గ్రామ పంచాయతి ఆకస్మికంగా తనిఖీ

-రికార్డుల నిర్వహణ, పన్నుల వసూళ్ల పై సమీక్ష
-డ్రై డే నిర్వహణా పై రికార్డుల పరిశీలన
-సీజనల్ వ్యాధులు నివారణ నేపధ్యంలో శానిటేషన్ , డ్రెయిన్ ల నిర్వహణా పై ప్రత్యేక దృష్టి సారించాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుధ్యం నిర్వహణపై మరింత దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం పిడింగోయి గ్రామ పంచాయతి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శానిటేషన్ రికార్డుల పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్యనికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించే దిశలో శనివారం జిల్లా వ్యాప్తంగా డ్రై డే నిర్వహించామన్నారు ఇందులో భాగంగా అన్ని మంచినీటి ట్యాంకులను శుభ్రపరచడం జరిగిందన్నారు. వాతావరణ మార్పులు, వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వ్యాప్తి నివారణ లో శానిటేషన్ , డ్రెయిన్ ల నిర్వహణా పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పంచాయతీ పన్నుల వసూళ్ల కోసం చర్యలు వేగవంతం చెయ్యాల్సి ఉందన్నారు.

పిడింగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలో 11 వాటర్ ట్యాంకులు ఉన్నాయని వాటిని శుభ్రపరచడం జరిగిందని పంచాయతీ సెక్రెటరీ ఎమ్. రూప్ చంద్ తెలిపారు. పన్ను పన్నేతర వసూళ్ళు కు సంబంధించి రెండు కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేయాల్సి ఉందని బండిలో ఇప్పటివరకు 75 లక్షలు వసూలు చేశామన్నారు. ఇళ్ల పన్నుల పశువులకు సంబంధించి కోటి 20 లక్షలు వసూలుకు గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాలను వేసి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. సిక్ ఇండస్ట్రీస్ కి చెందిన బకాయిలు సుమారు 85 లక్షలు ఉన్నట్లు పంచాయతీ కార్యదర్శి వివరించారు. శానిటేషన్, మురుగు కలవల నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు కలెక్టర్ కు వివరించారు.

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సమయంలో పంచాయతీ కార్యదర్శి రూప్ చందు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *