Breaking News

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పారిశుధ్య సమస్యకు పరిష్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విపరీతంగా పెరిగిపోయి చెత్త చెదారం తో పాటు విషజీవులకు ఆవాసంగా మారిన మల్లికార్జున పేట ఉప్పర వాగు కొండపై పారిశుద్ధ్య సమస్యల ను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్పొరేషన్ సిబ్బంది సమస్య పరిష్కరించారు. మల్లిఖార్జున పేట ఉప్పర వాగు కొండపై పారిశుద్ధ్య సమస్యతోపాటు పిచ్చి మొక్కలు పేరుకుపోయి సర్పాలతో పాటు దోమలకు నిలయంగా మారిందని స్థానికులు పశ్చిమ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కార్పొరేషన్ అధికారులకు తెలియజేయగానే వెంటనే సిబ్బంది ఈ ప్రాంతానికి వచ్చారు. కొండపైన పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించి ఈ ప్రాంతమంతా శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యను ఆలకించి పరిష్కారం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి మల్లికార్జున పేట ప్రాంతవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *