న్యూఢిల్లీ/ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు , గోపాలపురం నియోజకవర్గం, జిల్లా పరిథిలో ప్రస్తుత అధిక వర్షాలు మరియు వరదలపై జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం న్యూఢిల్లీ నుంచి కలెక్టర్ వారితో మంత్రి వర్యులు మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో మంత్రి కందుల దుర్గేష్ భారీ వర్షాలు, గోదావరి, ఎర్ర కాలువ లకి వరద నీరు చెరడం తో లోతట్టు ప్రాంతాలు, వ్యవసాయ భూముల వద్ద జాగ్రత్తలు పై మరియు ముంపుకు గురైన గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస రీహాబిలిటేషన్ సెంటర్ల వద్ద ఏర్పాట్ల పై సమీక్ష చేశారు. ఆయా పునరావాస కేంద్రాలలో మంచి హైజిన్ ఆహారం మరియు మంచినీళ్లు అందేలా చూడాలన్నారు. ముంపు గ్రామాల్లో పశువులను సురక్షిత ప్రాంతాలకి తరలింపు, పశుగ్రాసం అందేలా చూడాలన్నారు. అవసరమైతే ముంపు ప్రాంతాలలో వారిని పునరావాస సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పడవలను అందుబాటులో ఉంచాలన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న అధికారులు అందరూ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని, కాలువల్లో ఎక్కడ నీరు నిలవకుండా చూడాలన్నారు. ప్రతి గంటకు వివరాలు మరియు తీసుకుంటున్న చర్యలు పై నివేదిక అందచేయాలని ఆదేశించారు.
కలెక్టర్ ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, క్షేత్ర స్థాయిలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండడం జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిడదవోలు మండలంలో మూడు బోట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. ముంపు లో ఉన్న సెట్టిపేట గ్రామంలో ఒక ఇంటిలో ఉన్న ఒక పశువును గుర్తించి పడవ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. ముంపుప్రాంతాలన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News