ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం, వైజాగ్ నుండి ఇంద్రకీలాద్రి పై నున్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు గాను సదరు ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి రాంబాబు మరియు అధికారులు అమ్మవారికి ఆషాడ సారె సమర్పించుటకు విచ్చేయగా వీరికి దుర్గ గుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు.
Prajavartha Online Telugu News