మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశం మందిరం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక— “మీకోసం కార్యక్రమం” నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను ఎంతో ఓపిగ్గా విని సంబంధిత శాఖల అధికారులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకొని తమ సమస్యలు విన్నవించుకునేందుకు వస్తుంటారని, వారి పట్ల తగినంత శ్రద్ధ వహించి వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు.
మొత్తం 112 అర్జీలు జిల్లా యంత్రాంగానికి అందాయి.
అందులో కొన్నింటి అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి:
-పెడన మండలం కాకర్లమూడి గ్రామం గ్రామానికి చెందిన తుమ్మ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ గ్రామంలో ఆక్రమణలు తొలగించి రహదారి నిర్మించాలని కోరుతూ అర్జీ అందజేశారు.
-గుడివాడకు చెందిన బి వెంకట సుబ్బారావు తనకు గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామంలో ఎల్పీ నెంబర్ 2142 లో ఒక సెంటుకు బదులు 0.92 సెంట్లు ఆన్లైన్లో పట్టాదారు పుస్తకంలో తప్పుగా నమోదు చేశారని సర్వే చేసి దాన్ని సరి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
-మచిలీపట్నం మండలం నగరం ఇనగుదురు చెందిన షేక్ మొహమాబీ మాట్లాడుతూ తన మామ షేక్ హుస్సేన్
మిలిటరీలో పని చేశారని, ప్రభుత్వము వారు మేకవానిపాలెం లేఅవుట్ 772/773లో రీ సర్వే నంబర్ 9/4లో 0.02 సెంట్లు మేము నివాస స్థలం ఇచ్చారని
ఇల్లు కట్టుకొనుటకు పట్టా రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ అర్జీ అందజేశారు.
-మచిలీపట్నం నారాయణపురానికి చెందిన జన్ను కృష్ణకుమారి మాట్లాడుతూ తాను వికలాంగురాలని ఏ పని చేయలేనని తన భర్త కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని ఎవరు ఆదుకునే వారు లేరని తమకు 35 కిలోల బియ్యం మంజూరు చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేసింది.
యోగా వలన ఎన్నో ప్రయోజనాలు -ఉద్యోగులకు యోగ
ఆరోగ్యమే మహాభాగ్యమని అంటూ జిల్లా కలెక్టర్ ప్రతి ఒక్క ఉద్యోగి ఉచిత యోగ తరగతులలో పాల్గొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.
ఉద్యోగ జీవితంలో ఎన్నో ఒత్తిళ్లకు గురవుతుంటామని వాటన్నిటిని అధిగమించడానికి, ఆరోగ్యం బాగుండాలన్న యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
రేపు 23వ తేదీ మంగళవారం నుండి ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు మచిలీపట్నం లోని జడ్పీ కన్వెన్షన్ హాలులో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ తరగతుల్లో ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొనాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, ఆర్డీవో ఎం వాణి ఐ సి డి ఎస్ పి డి సువర్ణ, పార్వతి హెచ్ ఓ డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీతగోవిందం సి కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి డ్రామా పీడీ యువసేన జివి సూర్యనారాయణ డిపిఓ నాగేశ్వర్ నాయక్ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు ఆర్ అండ్ బి ఆర్ డబ్ల్యు ఎస్ శ్రీనివాసరావు, శివప్రసాద్ సర్వే భూ రికార్డుల ఏడి మనిషా త్రిపాఠి, ఏపీఎంఐపి పిడి విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News