Breaking News

ముత్తుకూరు సర్పంచిపై కుల దూషణకు పాల్పడి… సంతకాలు ఫోర్జరీ చేసినవారిపై చర్యలు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సర్పంచులను నామ మాత్రం చేసిన గత పాలకులు, వారి అనుచరులు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారనీ… కచ్చితంగా పంచాయతీలను బలోపేతం చేస్తామని ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజక వర్గం ముత్తుకూరు గ్రామ సర్పంచ్ బూదూరు లక్ష్మి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి, వైసీపీ నాయకులు తనను బెదిరించి, కుల దూషణలు చేయడం, తన సంతకం ఫోర్జరీ చేయడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలోని ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో కలసి ముత్తుకూరు సర్పంచ్ తనకు ఎదురైనా ఇబ్బందులు, అవమానాలను వివరించారు.
ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనపై వైకాపా నాయకులు, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుల దూషణకి పాల్పడుతున్నారని, ఊరి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ “ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మిపై వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడి సంతకాలు చేయించిన విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించాను. సంతకాలు ఫోర్జరీపై విచారణ చేపడతాము. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ సర్పంచ్ పట్ల కుల దూషణలకి పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికూడా ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు” అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *