Breaking News

కోవిడ్ పిదప ఊపిరితిత్తులవ్యాథిపై అవగాహన

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా పిదప మానవాళికి ఊపిరితిత్తుల వ్యాథులపై అవగాహన పెంచుకోవాలన్న ఆతృత ఏర్పడిందని ఉపిరితిత్తులు శ్వాసకోశవ్యాథుల నిపుణులు K.మిథునేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం కవిరాజపార్కులో జరిగిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోషియోషన్ సమావేశంలో ఆయన మఖ్య అతిథిగిహాజరై ముక్కుద్వారా ద్వారా గాలి అంటె ఆక్సిజన్ తీసుకొని ఊపిరితిత్తులద్వారా ఫిల్టర్ కాబడి కార్బన్ డై ఆక్సైడ్ వదలివేసి శ్వాస క్రియకు ఉపయోగపడతాయని అన్నారు. న్యుమోనియా TB ఆస్తమా ,సాధారణంగా బ్యాక్టీరియా స్వభావం కలిగిన ఇన్ఫెక్షన్ వల్ల కలిగే ఊపిరితిత్తుల వాపు తదితర ఊపిరితిత్తుల వ్యాథులతో తో జరిగే డేమేజిని సభ్యులకు వీడియోద్వారా తెరపై ప్రదర్శించారు. వాటినివారణకు తీసికొనవలసిన జాగ్రత్తలు మందులు సభ్యులచకు వివరించారు. అనంతరం Dr.MP ప్రియాంక శరీరంలో వచ్చే వివిథ నొప్పులకు సంబంథించి నివారణ గురించి విశదీకరించారు. అంతకు ముందు ఊపిరితిత్తుల సామర్థ్యం సంబంథించి పరీక్షలు అందరికి ఉచితంగా నిర్వహించి వాడవలసిన మందు/తీసికొనవలసిన జాగ్రత్తలు వివరించినారు. ఈ కార్యక్రమంలో అద్యక్షులు మొవ్వాసత్యన్నారాయణ శక్రటరీ పూర్ణచంద్రరావు చలమయ్య శివశంకర్రావు పలువురు సీనియర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *