-గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పై సమీక్ష నిర్వహించిన నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల
-జిల్లా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో కలిసి సమీక్ష
-సచివాలయంలోని కలెక్టర్ల సమావేశంలో రివ్యూ నిర్వహించిన మంత్రులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం జిల్లా ప్రజల వరప్రదాయని అయిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పై నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష చేపట్టారు. జిల్లా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో కలిసి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పై మంత్రి రామానాయుడు సమీక్షించారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో మంత్రులు ఇరువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులపై చేపట్టిన సమీక్షలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ స్థితిగతుల గురించి మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ప్రాజెక్టు గేట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చి సాగు నీటిని అందించేందుకు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News