కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
78వ స్వాతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అధికారికంగా పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్‌కల్యాణ్ మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది అమరుల త్యాగాల ద్వార వచ్చిన ఈ స్వాతంత్య్రం వేడుకల వేళ తాము ఆనందించాల్సిన దానికంటే.. దేశ బాధ్యతను గుర్తు చేసుకునే రోజు అని.. ఇలాంటి బాధ్యతే తనను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిందని గుర్తు చేశారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్య్ర యోదులను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గుర్తు చేశారు. దీంతో పాటుగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, డొక్క సీతమ్మ పేరు మీద మధ్యాహ్న భోజనం, ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాల గురించి పవన్‌కల్యాణ్ చెప్పుకొచ్చారు. రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకం తెచ్చిన ఎన్టీఆర్ స్ఫూర్తితో… అన్న క్యాంటీన్లతో 5రూపాయలకే భోజనం పెట్టే పథకం ప్రారంభిస్తున్నామని వెల్లడిరచారు. ప్రజా సంపదన దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గత ఐదేళ్లు లా అండ్ ఆర్డర్ క్షీంచింది,స్కూల్ కి వెళ్లిన సుగాలి ప్రీతి ఇంటికి రాలేదన్నారు. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి, ఎక్కడ రాజీ పడకూడదని కోరారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి విచ్చలవిడిగా మాట్లాడితే సీరియస్‌గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిందన్నారు. శేషాచలం అడవులులో కొట్టేసిన ఎర్ర చందనం కర్ణాటకలో అమ్ముకున్నారని ఫైర్ అయ్యారు.
Prajavartha Online Telugu News