Breaking News

మహిళల రక్షణ కొరకు కొవ్వొత్తుల ర్యాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏ.పి పోలీస్ సంయుక్త ఆద్వర్యంలో రేపు 20.08.2024 (మంగళవారం) సాయంత్రం 7.00 గంటలకు కాండిల్ ర్యాలి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహిళా మండలి అధ్యక్ష్యులు డాక్టర్ బి.కీర్తి మాట్లాడుతూ కలకత్తా లో డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఈ ర్యాలిని నిర్వహిస్తున్నట్లు ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగళపూడి అనిత  వస్తున్నారని ఆమె అన్నారు. ఈ ర్యాలి బందరు రోడ్డు లోని డి.వి మేనర్ హోటల్ నుండి పి.బి సిద్దార్ధ అకాడమి వరకు జరుగుతుందని ఆమె అన్నారు. ఐ.ఎ.డి.వి.యల్, యఫ్.ఒ.జి.యస్.ఐ. కార్యక్రమంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఐ.డి.ఎ, రోటరి క్లబ్ ఆఫ్ అమరావతి, మహిళలు, వాలంటీర్లు తదితరులు పాల్గొంటున్నారని ఆమె అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *