Breaking News

అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థని పటిష్టంగా, ప్రణాళికాబద్దంగా నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్నఅండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థని పటిష్టంగా, ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని, సుద్దపల్లి డొంక రోడ్ లోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పని తీరు మెరుగయ్యేలా ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ బస్టాండ్ ఎదురు నుండి ఉన్న యుజిడి లైన్ ను, సుద్దపల్లి డొంక రోడ్ లోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, అవుట్ ఫాల్ డ్రైన్ ను, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి తగు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రస్తుతం తూర్పు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో యుజిడి లైన్లు ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రధానంగా బస్టాండ్ ఎదురు ప్రాంతాల్లో లైన్లు పూడికతో నిండి బ్లాక్ అవుతున్నాయని, దీని వలన ఎగువ ప్రాంతాల్లో, మురుగు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. మ్యాన్ హోల్స్ దగ్గర ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా ఏఈలు పర్యవేక్షణ చేయాలన్నారు. అనంతరం సుద్దపల్లి డొంక రోడ్ లోని యుజిడి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకొని, అధికారులతో మాట్లాడుతూ ప్లాంట్ సామర్ధ్యానికి తగిన విధంగా పని చేయడం లేదని, ట్రీట్మెంట్ అనంతరం కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు వస్తున్నాయన్నారు. ప్లాంట్ లో విధులు నిర్వహించే సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్లాంట్ లోని బయోగ్యాస్ యూనిట్ ని వినియోగంలోకి తీసుకురావడానికి ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు.
అనంతరం ప్రగతి నగర్ పరిసరాల్లో పారిశుధ్య పనులు పరిశీలించి, అవుట్ ఫాల్ డ్రైన్ కు రిటైనింగ్ వాల్ సక్రమంగా లేకపోవడం వలన వర్షాల సమయంలో డ్రైన్ పొంగుతుందని, వ్యర్ధాలు డ్రైన్ లోనే ఉంటున్నాయని, సదరు ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అవుట్ ఫాల్ డ్రైన్ వద్ద ప్రతి 2 రోజులకు ఒకసారి తప్పనిసరిగా వ్యర్ధాలను జెసిబితో తొలగించాలన్నారు. అలాగే చుట్టుపక్కల నివాసాల ప్రజలు వ్యర్ధాలను కాల్వలో వేయకుండా అవగాహన కల్గించాలని, రోడ్ మార్జిన్లలో ఆక్రమణలు రాకుండా శానిటేషన్, ప్లానింగ్ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ శ్రీధర్, ఎస్ఎస్ లు రాంబాబు, ఆయూబ్ ఖాన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఐజాక్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *