Breaking News

జక్కంపూడి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలన

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా జక్కంపూడి లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ , అజిత్ నగర్ లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా జక్కంపూడి లో ఉన్న గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలించి అక్కడున్న వ్యర్థాలను లెవెల్ చేసి పునరుద్ధరణ చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యర్ధాల నిర్వహణను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం వ్యర్ధ నిర్వహణ పర్యవేక్షిస్తుండాలని, అనధికారంగా వ్యర్థాలను వేయకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అజిత్ సింగ్ నగర్ లో ఉన్న ఎక్సెల్ ప్లాంట్, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో వస్తున్న వ్యర్థాలను పరిశీలించారు. వ్యర్ధాలు వేరుచేసేలా సానిటరీ ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్రతో పాటు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పి. రత్నావళి, యస్.ఈ (ప్రాజెక్ట్స్) రామ్మోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *