Breaking News

ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెలాఖరిలోగా ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ పి సిసోడియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం ఉదయం ముఖ్య కార్యదర్శి సీసీఎల్ఏ జి జయలక్ష్మి తో కలసి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో ఫ్రీ హోల్డ్ భూములపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ ఫ్రీ హోల్డ్ భూముల పరిశీలన కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. పరిశీలన పూర్తయ్యాక లోటు పాట్లు ఏమైనా ఉంటే ప్రభుత్వ నిర్ణయం మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో 682 ఎకరాలు ఫ్రీహోల్డ్ భూములుగా గుర్తించామని, అందులో ఇప్పటివరకు 11.9 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగిందని, 142 ఎకరాల మేరకు రికార్డులను పరిశీలన చేశామని వివరించారు. మిగిలిన భూములకు సంబంధించిన రికార్డులను ఒక వారంలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ కలెక్టరేట్ భూ విభాగం పర్యవేక్షకులు నెల్సన్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *