విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖమాత్యులు నాదెండ్ల మనోహర్ ఈరోజు కృష్ణాజిల్లాలోని కంకిపాడు మండలంలో గల పునాదిపాడు రైతు సేవ కేంద్రంలోని ధాన్యము సేకరణ కేంద్రమును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులతో చర్చించి గతంలో ధాన్యము కొనుగోలులో తలెత్తిన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని మొబైల్ యాప్/ ధాన్యము సేకరణ పోర్టల్లో మార్పులు చేయడం జరిగిందని మరియు ఈ సంవత్సరం నుంచి రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లును ఎంపిక చేసుకునే విధముగా ఏర్పాటు చేశామని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని , ఇకనుండి రైతులు తమ అమ్మిన ధాన్యమును 48 గంటలలోపే చెల్లింపులు అత్యంత పారదర్శకముగా రైతులు బ్యాంక్ ఖాతాలో జమ చేయబడునని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోవు ధాన్యము కొనుగోలు ప్రక్రియ సమయంలో సాంకేతి పరంగా మరి ఏ ఇతర విధంగా రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మరియు సంబంధిత అధికార యంత్రాంగం పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News