Breaking News

సమస్యల పరిష్కార లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మౌళిక వసతుల కల్పన, సమస్యల పరిష్కార లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలను అమలు చేస్తుందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం స్థానిక రైల్ పేటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పి.సమత, అధికారులతో కలిసి కమిషనర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత వార్డ్ సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలనలో అమలు చేసిన కార్యక్రమాలను తెలియచేస్తూ, అమలు చేసిన కార్యక్రమాలు వివరిస్తూ రూపొందించిన కరపత్రాలు ప్రజలకు పంపిణీ చేసి మన మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అంటించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పెన్షన్ ల పెంపు, అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరకు అందించడం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. నగరంలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమాల అమలుకు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు ఒక్కో డిప్యూటీ కమిషనర్లకు విధులు కేటాయించామన్నారు. అలాగే 206 వార్డ్ సచివాలయ కార్యదర్శులు పూర్తి స్థాయిలో పాల్గొనేలా పర్యవేక్షణకు 41 మంది నోడల్ అధికారులను నియమించామని తెలిపారు. నగర ప్రజలు కూడా తమ ఇంటి వద్దకు వచ్చే సిబ్బందికి తమ స్థానిక సమస్యలను కూడా తెలియచేయవచ్చన్నారు.
అనంతరం రైల్ పేట లోని స్టేషన్ రోడ్ ని పరిశీలించి, డ్రైన్ల పై ఆక్రమణలను గమనించి వాటిని తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. రైల్వే స్టేషన్, ప్రభుత్వ వైద్యశాలకు నిత్యం వేలాది మంది రాకపోకలు చేస్తుంటారని, అత్యవసర వాహనాలు కూడా వచ్చే మార్గంలో రోడ్ ఆక్రమణలు సహించే సమస్యే లేదన్నారు. ఆక్రమణల వలన డ్రైన్లు కూడా మురుగు పారుదల లేక వర్షం నీరు, డ్రైనేజి రోడ్ల మీదకు వస్తున్నందున ఆక్రమణలను తొలగించాల్సిందేనని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఎంహెచ్ఓ రామారావు, ఎస్ఎస్ ఆయుబ్ ఖాన్, ఉపా సెల్స పిఓ వేణుబాబు, వార్డ్ సచివాలయ విభాగ సూపరిండెంట్ శివన్నారాయణ, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *