గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @2047 విజన్ అభివృద్ధి కోసం చేపట్టనున్న డాక్యుమెంట్ కోసం ఈ నెల 25 న జరిగే వార్డ్ సభలు కీలకమని, సభల్లో ప్రజల నుండి రాష్ట్ర అభివృద్ధికి సూచనలు, సలహాలను ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ద్వారా సేకరిస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్వర్ణాంధ్ర @2047 విజన్ అభివృద్ధిపై జరిగే వార్డ్ సభల నిర్వహణపై ప్రత్యేక, నోడల్ అధికారులతో కమిషనర్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @2047 విజన్ అభివృద్ధి కోసం చేపట్టనున్నడాక్యుమెంట్ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో ఈ నెల 25న ప్రతి ఎలక్షన్ వార్డ్ లో వార్డ్ సభలు జరపాలన్నారు. వార్డ్ సభల నిర్వహణకు నోడల్ అధికారులు భాధ్యత తీసుకోవాలని, స్థానిక కార్పొరేటర్లు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు ఆహ్వానించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గానికి డిప్యూటీ కమిషనర్ 2 సిహెచ్.శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గానికి డిప్యూటీ కమిషనర్ 3 టి.వెంకట కృష్ణయ్య, జిఎంసి పరిధిలోని ప్రత్తిపాడు నియోజకవర్గానికి డిప్యూటీ సిటి ప్లానర్ శ్రీనివాస్ ని ప్రత్యేక అధికారులుగా నియమించామని తెలిపారు. వార్డ్ సభల్లో స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యార్ధులు, యువతను భాగస్వాములు చేయాలన్నారు. సభకు హాజరైన ప్రజలకు ముఖ్యమంత్రి గారి వీడియో సందేశం, కరపత్రాలు, పోస్టర్స్ ద్వారా అవగాహన కల్గించాలన్నారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరి ద్వారా ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. వార్డ్ సభల విజయవంతానికి నోడల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఈఈ సుందర్రామిరెడ్డి, సభల పర్యవేక్షణ అధికారి సాధిక్ భాష, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News