Breaking News

తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి ఇచ్చేలా నగర ప్రజలను చైతన్య పరచాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 5 వ తేదీ నుండి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి ఇచ్చేలా నగర ప్రజలను చైతన్య పరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. గురువారం సాయంత్రం నగరంలోని నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులు సిబ్బందితో చెత్త నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల నాలుగో తేదీన శుక్రవారం ఉదయమే నగరంలోని ప్రతి ఇంటికి పోయి చెత్తను తడి చెత్త, పొడి చెత్త గా వేరుచేసి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ఆ ప్రకారం ఈనెల 5వ తేదీ శనివారం నుండి వేరు చేసిన తడి, పొడి చెత్తలను ప్రతి ఇంటి నుండి సేకరించాలన్నారు. ఇప్పటివరకు మునిసిపల్ సిబ్బంది కార్మికులు సిబ్బంది తడి పొడి చెత్త లను కలిపేసి చెత్త బండిలో వేయడం జరుగుతుందన్నారు. ఇకపై అలా కూడా జరగరాదని ప్రజలు వేరువేరుగా ఇచ్చే తడి పొడి చెత్తలను అలాగే వేరువేరుగానే ఉంచాలన్నారు.

నగర శివార్లలో ఆంధ్ర జాతీయ కళాశాల సమీపంలో చల్లపల్లి మార్గంలో ఉన్న డంపు యార్డ్ లో తడి పొడి చెత్తలు కలిసి ఆ విధంగా తయారయిందన్నారు. మరలా ఆ విధంగా తయారు కాకూడదని స్పష్టం చేశారు. ఇదొక యజ్ఞంలో భావించి ప్రతి ఒక్కరు తడి పొడి చెత్తలను వేరువేరుగా సేకరించేందుకు తప్పనిసరిగా తన వంతు కృషి చేయాలన్నారు. అందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడి పనిచేయాలన్నారు.అప్పుడే అనుకున్న లక్ష్యం సాధ్యపడుతుందన్నారు. మొదట్లో కొంత ఇబ్బంది ఉన్న ప్రజలు రాను రాను అర్థం చేసుకొని క్రమేణ వారిలో మార్పు వస్తుందన్నారు.

తాను కూడా అక్కడక్కడ వార్డుల్లో తనిఖీ చేస్తానని ఆ సమయంలో తనకు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా కనపడాలన్నారు. తడి చెత్త కుళ్లిపోయి ఎరువుగా ఉపయోగపడుతుందని, పొడి చెత్తను గుంటూరులోని జిందాల్ కంపెనీకి పంపడం జరుగుతుందన్నారు. ఆ ప్రకారం చెత్తను నిర్వహించదం వలన ఎక్కడ చెత్త పేరుకొని పోదన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన మున్సిపల్ కమిషనర్ బాపిరాజును జిల్లా కలెక్టర్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు పలువురు శానిటరీ కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు సానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు ఆరోగ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *