ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏడుకొండల పై కొలువై ఉన్న దేవ దేవుడు కలియుగ దైవం పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శుక్రవారం కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. సహాయ కార్య నిర్వహణ అధికారి బి. దొరస్వామి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు తోడుకొని వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, సిబ్బందికి
ఇంద్రకీలాద్రి కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు, ఉప కార్యనిర్వహణాధికారి రత్నరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శాస్త్రి స్వాగతం పలికారు. వేద పండితులు మేళ తాళాలతో సాంప్రదాయ బద్దంగా అమ్మవారి అంతరాలయానికి తోడుకొని వెళ్లారు. అంతరాలయంలో మహిషాసుర మర్దని అలంకారంలో కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈఓ రామారావు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, అమ్మవారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఎస్. కళాబాయి, బిఎస్ ప్రియదర్శిని,బి. భరత్, మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News