Breaking News

విపత్తు నుంచి విజయవంతమైన వేడుకలు

-ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల సంభవించిన వరద విపత్తు నుంచి విజయవంతంగా జరిగిన దసరా వేడుకలతో విజయవాడ నగరం ప్రకాశించిందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వరద విపత్తుతో ప్రజలందరి గుండెలు బరువెక్కాయని నేడు శరన్నవరాత్రుల వెలుగులతో విజయవాడ నగరం ప్రకాశించిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ అవిశ్రాంత కృషి, దుర్గమ్మ చల్లని దీవెనలతో నగరవాసులకు స్వాంతన చేకూరిందన్నారు. విజయవాడ నగరం వరదల నుంచి కోలుకొని విజయదశమిని అత్యంత వైభవంగా జరుపుకొందని ఎమ్మెల్యే సుజనా శనివారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *