-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే ఏడాది జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. కొత్త వారితో పాటు పాతవారు కూడా నమోదు చేసుకోవాలని.. సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్, ఫోటో, ఆధార్ కార్డుతో ఫారం-18 ద్వారా ఆన్ లైన్లో సులభంగా ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. అలాగే పట్టభద్రుల సౌకర్యార్ధం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఓ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు మల్లాది విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. ఫోన్ నెంబర్ 8919826398 ను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కనుక పట్టభద్రులు ఏఒక్కరూ మిగిలిపోకుండా.. షెడ్యుల్‌లోగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యావంతులు చైతన్యవంతంగా వ్యవహరించి తమ ప్రతినిధులను ఎన్నుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News