తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తయారీ నేపథ్యంలో రాష్ట్ర గ్రోత్ రేట్ 15 శాతం పైన ఉండేలా గ్రోత్ ఇంజన్లతో ప్రతి జిల్లా ప్రణాలికలు తయారు కావాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ఏపీ సెక్రటేరియట్ నుండి నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ కు కలెక్టర్ వివరిస్తూ రాబోవు 5 సం.ల కు సంబంధించిన మండల విజన్ డాక్యుమెంట్ పూర్తి అయిందని, జిల్లా హెచ్ఓడి లు అందచేసిన విజన్ ప్రణాళికలను జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారు చేయుట కొరకు క్రోడీకరించుట పురోగతిలో ఉందని తిరుపతి జిల్లా విజన్ డాక్యుమెంట్ ఈ నెల 17 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.జిల్లాలోని పలు కేటగిరీలకు చెందిన ప్రజానీకం వారు స్వర్ణాంధ్ర 2047 సంబంధించి ఫీడ్బ్యాక్ పంపడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రణాళికా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News