Breaking News

అధికారులు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ హౌసింగ్ లే అవుట్స్ ల్లో ఇళ్ళ నిర్మాణ పనుల కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు, స్వంతంగా నిర్మాణం చేసుకునే వారు డిశంబర్ నాటికి నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేసేలా హౌసింగ్, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ లో ఇంజినీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎమినిటి కార్యదర్శులు, హౌసింగ్ లే అవుట్స్ ల్లో ఇళ్ళ నిర్మాణ పనుల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత లే అవుట్స్ వారిగా ఇళ్ళ నిర్మాణం ఏ మేరకు పూర్తి అయింది, గ్రౌండ్ లెవల్ ఎన్ని ఉన్నది, మౌలిక వసతులు, బిల్స్ చెల్లింపు, ఇసుక, సిమెంట్, ఇనుము లభ్యత తదితర అంశాలను లే అవుట్ల వారీగా ఎమినిటి కార్యదర్శులను అడిగి తెల్సుకొని, మాట్లాడుతూ హౌసింగ్ లే అవుట్స్ ల్లో ఇళ్ల నిర్మాణపనులు కాంట్రాక్టర్ల వారీగా ఇచ్చిన టైం లైన్ మేరకు జరగాలని, నిర్మాణ పనుల కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు అవసరమైన కార్మికులను సిద్దం చేసుకోవాలన్నారు. అలాగే స్వంతంగా నిర్మాణం చేసుకునే వారు కూడా త్వరగా చేసుకునేలా తోడ్పాటుని అందించాలన్నారు. స్థల లబ్దిదారుల్లోని డ్వాక్రా సభ్యులకు బ్యాంక్ ల నుండి రూ.35 వేలు ఋణం అందించేలా చర్యలు తీసుకోవాలని మెప్మా సిబ్బందిని ఆదేశించారు. ప్రతి లే అవుట్ లో ఇళ్ల నిర్మాణ పనులపై నోడల్ అధికారులు కూడా పర్యవేక్షణ చేయాలన్నారు. లే అవుట్ ల వారిగా ఎప్పటికప్పుడు పనుల పురోగతి పై నివేదిక ఇవ్వాలని, ఏ సమస్య ఎదురైనా అధికారులు సమన్వయంతో పరిష్కరించి పనుల వేగవంతంకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ పనులు పూర్తి అయిన వాటికి సంబందించి బిల్లుల ఆన్ లైన్ ఎమినిటి కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు చేయాలని, జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, ఎస్.ఈ నాగ మల్లేశ్వరరావు, ఈఈలు సుందర్రామిరెడ్డి, శ్రీనివాస్, ఉపా సెల్ పిఓ బాలాజీ బాష, హౌసింగ్ డిఈఈలు, ఏఈలు, ఎమినిటి కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *