Breaking News

పావని కన్స్ట్రక్షన్స్ సౌజన్యంతో.. ఈ నెల 23 నుంచి డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-6

-డీపీఎల్ ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించిన కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్
-దీపావళి పండుగ సందర్భంగా వైద్యులకు ఆటవిడుపు
-12 ఫ్రాంచైజీలు.. 160 మంది డాక్టర్లతో డీపీఎల్ సీజన్-6
-పావని సోలిటైర్ లగ్జరీ హౌసింగ్ కమ్యూనిటీ ఆవిష్కరణ
– 1.5 ఎకరాల విస్తీర్ణంలో, బహుళ సౌకర్యాలతో 78 లగ్జరీ అపార్టుమెంట్లతో పావని సోలిటైర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాణదాతలైన వైద్యులకు ఆటవిడుపుగా రూపుదిద్దుకున్న డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-6కు రంగం సిద్ధమైంది. డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరగనున్న డీపీఎల్-6 ట్రోఫీ, ఆటగాళ్ల జెర్సీలను మాజీ మంత్రి, కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. పెనమలూరులోని పావని సోలిటైర్ లగ్జరీ హౌసింగ్ కమ్యూనిటీ నందు ఆదివారం జరిగిన కార్యక్రమంలో, డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-6ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో నిరంతరం తలమునకలై ఉండే వైద్య నిపుణులకు డీపీఎల్ ద్వారా పునరుత్తేజం లభిస్తుందని అన్నారు. పలు హాస్పిటళ్లు, అనేక మంది వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ తరహా భారీ క్రికెట్ క్రీడా సంరంభాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. డీపీఎల్ సీజన్-6 టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న పావని కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న పావని సోలిటైర్ ప్రాజెక్టును డాక్టర్ కామినేని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం, పావని కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పాకలపాటి వీర రాఘవరావు మాట్లాడుతూ, నగరంలో 12 ప్రముఖ హాస్పిటల్స్ ఫ్రాంఛైజీలుగా ఉన్న ఈ మెగా ఈవెంట్ నందు 160 మంది వైద్య నిపుణులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి డీపీఎల్-6 క్రికెట్ పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీపావళి నేపథ్యంలో.. ‘ఫెస్టివల్ ఆఫ్ లైట్స్.. ఫెస్టివల్ ఆఫ్ సిక్సెస్’గా డీపీఎల్ జరుగుతుందని తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా, పావని సోలిటైర్ లగ్జరీ హౌసింగ్ కమ్యూనిటీ అనేక ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంటోందని వివరించారు. పూర్తి పర్యావరణ అనుకూలంగా, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యద్భుతంగా సోలిటైర్ ను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మొత్తం 1.5 ఎకరాల విస్తీర్ణంలో, బహుళ సౌకర్యాలతో 78 లగ్జరీ అపార్టుమెంట్లతో ఈ ప్రాంతానికే తలమానికంగా పావని సోలిటైర్ నిలుస్తుందన్నారు. నగరంలోని వైద్య నిపుణుల కోసం ఈ ప్రాజెక్టులో ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నామని వీర రాఘవరావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రశాంత్ కుమార్, ప్రస్తుత ప్రెసిడెంట్ డాక్టర్ కార్తీక్ తుమ్మల, పావని కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ డాక్టర్ సాయి శ్రీ హర్ష పాకలపాటి, డీపీఎల్-6లో పాల్గొంటున్న 12 ఫ్రాంచైజీల సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *