Breaking News

అంతర్జాతీయ వర్క్ షాప్ విజయవంతం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అర్బన్ ల్యాండ్ రికార్డ్ కోసం సర్వే- రీ సర్వేలో ఆధునిక సాంకేతిక విధానాల అమలుపై ఈ నెల 21, 22 తేదీల్లో న్యూ డిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగిన అంతర్జాతీయ వర్క్ షాప్ విజయవంతంగా జరిగిందని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ భూ వనరులు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ వర్క్ షాప్ లో నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ – పట్టణ నివాసాల ఆధారిత భూమి సర్వే (NAKSHA)లో భాగంగా ఆంద్రప్రదేశ్ లో ఎంపికైన కుప్పం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, ఏలూరు, కాకినాడ, తిరుపతి, అనంతరపురం మునిసిపాలిటీలు, కార్పోరేషన్ల కమిషనర్లు, రాష్ట్ర డైరెక్టర్ సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రికేష్ బి.లత్కర్ పాల్గొన్నారన్నారు. వర్క్ షాప్ లో వివిధ దేశాల, రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని ఆయా ప్రాంతాల్లో పట్టణాల్లో జరుగుతున్న భూ సర్వే, రీ సర్వే విధానాలను కూలంకషంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారన్నారు. ముఖ్యంగా సర్వే విధానంలో అత్యాధునిక డ్రోన్ లు, జిఐఎస్ సాంకేతికల వినియోగం ద్వారా, రికార్డ్స్ భద్రపరచడం వంటి అంశాలాను ఉదాహరణలతో చర్చించడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *