Breaking News

జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… : ఇంచార్జి మంత్రి నాదెండ్ల మనోహర్

ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ ఒక్కరూ గర్వపడేవిధంగా జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం జిల్లా ఇంచార్జి మంత్రిగా తొలిసారి కలెక్టరేట్ కి విచ్చేసిన సందర్భంగా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, అధికారులు మంత్రికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఒకే భావన, ఆలోచనలతో కలిసి సమిష్టిగా పనిచేసి, ప్రజలకు మరింత మెరుగైన సేవలందిద్దామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా దృష్టి పెట్టాలన్నారు. పార్లమెంట్ సభ్యులు, జిల్లాపరిషత్ చైర్ పర్సన్, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులకు ప్రజలు అందించే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య , పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, , ప్రభృతులు ఉన్నారు. .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *