Breaking News

భవనాలకు లేఔట్లకు తప్పనిసరిగా అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ముడా పరిధిలో నిర్మించే భవనాలకు లేఔట్లకు తప్పనిసరిగా అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని భవన నిర్మాణాలు, లేఔట్ లపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముడా అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) టౌన్ ప్లానింగ్ కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్లో సమీక్షించారు.

ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరపాలక సంస్థ, పెడన మున్సిపాలిటీ తో పాటు, సి ఆర్ డి ఏ పరిధి మినహా మిగతా మండలాలు ముడా పరిధిలోకి వస్తాయని, ఈ పరిధిలో నిర్మించే భవనాలకు, లేఅవుట్లకు అనుమతుల మంజూరు ప్రక్రియ కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. భవన నిర్మాణాలకు ప్రాథమిక అనుమతులు ఇచ్చాక ఏవైనా లోపాలు ఉంటే స్టాప్ వర్క్ ఆర్డర్ ఎలా అమలు అవుతుందో కలెక్టర్ ఆరా తీశారు. అనుమతులు పొందిన భవనాలు వారు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే నిర్మిస్తున్నారా లేదా సమగ్ర వెరిఫికేషన్ విధానం అమలు చేయాలన్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తుంటే నిబంధనల మేరకు నోటీసులు జారీ చేయడం, అవసరమైన చర్యలు చేపట్టుటకు స్పష్టమైన విధానం అమలు చేయాలన్నారు.

ల్యాండ్ కన్వర్షన్ లేకుండా లేఔట్లు వేయకూడదని, లేఔట్ నిబంధనల ప్రకారం 15% మార్టీగేజ్ , 10% ఓపెన్ స్పేస్ ఉండాలని అన్నారు., నగరపాలక సంస్థలో, మున్సిపాలిటీలలో ప్రత్యేక టౌన్ ప్లానింగ్ విభాగం ఉంటుందని, కానీ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ ప్రణాళిక కార్యదర్శులు ఉంటారని, వీరికి భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతులపై వర్క్ షాప్ నిర్వహించి అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్, ముడ విసి ఇంచార్జ్ గీతాంజలి శర్మకు కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ వివిఎస్ బాపిరాజు, డిపిఓ జె అరుణ, ముడా ప్లానింగ్ అధికారి డి. శాంతిలత, ముడ లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రవిశంకర్, ఐ. పద్మావతి, నగరపాలక సంస్థలో టీపిఓ కె శ్రీహరి ప్రసాద్, యూనియన్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *