-జెసిబి, ప్రొక్లైన్ వంటి యంత్రాలను ఉపయోగించడానికి అనుమతులు లేవు
-జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇసుక తవ్వకాలు మాన్యువల్ పద్ధతిలోనే చేపట్టాలని, తవ్వకాలకు జెసిబి, ప్రొక్లైన్ వంటి యంత్రాలను ఉపయోగించడానికి ఎలాంటి అనుమతులు లేవని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వాహన రవాణాదారులకు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని మీకోసం సమావేశపు మందిరంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఇసుక తవ్వకాలపై రవాణాదారులతో సమావేశమై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని ఇసుక రీచ్ ల్లో జెసిబి, ప్రొక్లైన్ వంటి యంత్రాలను ఉపయోగించడానికి వీల్లేదని, కేవలం మనుషులతో (మాన్యువల్) తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి ఉదాసీనత ఉండదని, నిబంధనలను ఉల్లంఘించిన వారి యంత్రాలను సీజ్ చేసి ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ఇదే విషయాన్ని ఇతర రవాణాదారులకు సమాచారం అందించాలని సూచించారు.
Prajavartha Online Telugu News