Breaking News

బి సి ఎం పాఠశాల క్రీడా ఆణిముత్యాలను అభినందించిన జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకుని, రాణించాలని తెలుపుతూ బిసిఎం పాఠశాల క్రీడా ఆణిముత్యాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అభినందించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు మంగళం స్థానిక బాలచంద్ర మెమోరియల్ హై స్కూల్ క్రీడాకారులు మర్యాద పూర్వకంగా తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ని కలిశారు. జంప్ రోప్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. ఇలాగే క్రీడల్లో ముందుకు సాగాలని మరెన్నో విజయాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లా, రాష్ట్రం, దేశానికి మంచి గౌరవాన్ని ప్రతిష్టతను తేవాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తూ మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిల వరకు ప్రోత్సహించిన కరస్పాండెంట్ ప్రియా ను మరియు వ్యాయామ ఉపాధ్యాయురాలు ప్రమీనను తిరుపతి జెసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎన్డీసి దేవేంద్ర రెడ్డి, పిడి డిఆర్డిఎ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *