Breaking News

మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆర్థిక సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
45 వ డివిజన్ సితార పరిధిలోని ఆటో డ్రైవర్ చిలకపల్లి వెంకట్రావు 58 ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి భార్య , కొడుకు ఉన్నారు.నిరుపేదలైన వెంకట్రావు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని 45వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు బొమ్ము గోవింద లక్ష్మి ఎమ్మెల్యే సుజనాను కోరగా తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. మృతుని భార్య మంగకు ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే సుజనాకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *