Breaking News

స్వయం సహాయక సంఘాల మహిళలకు పొరుగు వ్యాపార విభాగాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని మహిళలు ప్రభుత్వ సహాయంతో పొరుగు వ్యాపార ఆడిట్ విభాగాలను(నైబర్హుడ్ బిజినెస్ యూనిట్ లు) ఏర్పాటు చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్వయం సహాయక సంఘాల మహిళలకు పిలుపునిచ్చారు.

శనివారం మధ్యాహ్నం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ మీటింగ్ సమావేశం మందిరంలో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు పొరుగు వ్యాపార విభాగాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేకంగా పొరుగు వ్యాపార విభాగాలను (నైబర్హుడ్ బిజినెస్ యూనిట్లు) నెలకొల్పుటకు ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సంకల్పించిందన్నారు. ఇందులో భాగంగా కృష్ణాజిల్లాను ప్రయోగాత్మకంగా తీసుకొని ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో ఆసక్తి ఉన్న 196 మంది మహిళా సభ్యులను గుర్తించి శిక్షణ తీసుకుంటున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను, సౌకర్యాలను అందిపుచ్చుకొని మహిళలు తమ ఇరుగుపొరుగులోనే ఆడిట్ వ్యాపారాలు చేయుటకు దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలన్నారు. తద్వారా వారు అంచలంచలుగా ఎదిగి ఆర్థిక అభివృద్ధి సాధించగలరన్నారు. సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ఏమైనా సాధించవచ్చన్నారు
అమూల్ పాల వ్యాపారం మహిళలే చేపట్టారని చిన్నగా మొదలుపెట్టి నేడు దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల టర్న్ అవుట్ చేస్తుందన్నారు. అలాగే ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ కంపెనీ మొదట్లో చిరు వ్యాపారంతో మొదలుపెట్టి నేడు వేలకోట్ల రూపాయల ఆదాయంతో వ్యాపారం చేస్తున్నారన్నారు.
మొదట్లో ఉత్సాహంతో యూనిట్లు మొదలుపెట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ఓపికతో ఉండాలని అప్పుడే విజయం సాధించవచ్చని సూచించారు.

రాష్ట్ర సేర్ఫ్ డైరెక్టర్ పద్మావతి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మహిళలను డ్వాక్రా తరహాలో సంఘాలుగా ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నైబర్హుడ్ బిజినెస్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు.
ఆసక్తిగల యువత, మహిళల జాబితా సేకరించి వివిధ శాఖలు, ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలలో అనుసంధానించి పర్యవేక్షణ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు.
ఆడిట్ నైబర్హుడ్ బిజినెస్ యూనిట్ల సభ్యులకు కనీసం మూడు సంవత్సరాలు ఆపైన సంఘంలో సభ్యులుగా ఉండాలని, డిఫాల్ట్ గా ఉండరాదని, అకౌంట్స్, కామర్స్ చదివి ఉండాలని, ఆడిట్ సి ఆర్ పి గా అనుభవం కలిగి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.
ఒక్కో యూనిట్లో 5 నుంచి 10 మంది సభ్యులు ఉండవచ్చని మండలానికి ఒక యూనిట్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఈ యూనిట్ల ఏర్పాటు వలన స్వయం సహాయక సంఘాల్లో నిధుల దుర్వినియోగం జరగకుండా అరికట్టవచ్చని, ఆర్థిక అక్షరాస్యత సాధించి సంఘాలు బలోపేతం అవుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో సెర్ఫ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ బి శ్రీనివాస్, డి ఆర్ డి ఐ ఇన్చార్జి పిడి అరుణ, మచిలీపట్నం ఆర్డిఓ కే స్వాతి, డి పి ఎం ఐబి సత్యభామ పలువురు స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *