-టి డి ఆర్ బాండ్ల ను పారదర్శకంగా పరిశీలించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడిఆర్ పనులను పారదర్శకంగా పరిశీలించారని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కమిటీ సభ్యులతో అన్నారు. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో టిడిఆర్ బాండ్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గుణదల, డోర్నకల్ రోడ్డు, ఎంజి రోడ్ నుండి ఎన్టీఆర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఆటోనగర్ వరకు గల ప్రాంతాలలో టి డి ఆర్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను కమిటీ ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం స్థలం లేదా నిర్మాణం కోల్పోయిన ప్రజలు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి టిడిఆర్ బాండ్లు ఇచ్చేందుకు ఈ కమిటీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ ద్వారా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కొరకు మాస్టర్ ప్లాన్ ద్వారా వారు ఎంత ప్రదేశం కోల్పోయారు, ఆ ప్రదేశం యొక్క మార్కెట్ విలువ ఆధారంగా, కమిటీ సభ్యుల అంగీకారంతో టిడిఆర్ బాండ్లను విడుదల చేస్తామని తెలిపారు.
ఇప్పుడు వరకు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 31 టిడిఆర్ బొండ్లను, కమిటీ సభ్యులు పరిశీలించారు. అందులో భాగంగా కమిటీ సభ్యుల అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు మార్కెట్ విలువ ఎంతుందో కచ్చితంగా అంతే ఉన్నాయా అని విచరించారు. కమిటీ సభ్యులను ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను స్వయంగా విచారించి పరిశీలించి, అభ్యంతరాలు ఉన్న, అంగీకరించిన వాటిని తెలుపమన్నారు.
ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన, ఆర్ డి, డి టి సి పి రాజమహేంద్రవరం శ్రీనివాస్ మూర్తి, డిటిసిపి (ఏపీ సి ఆర్ డి ఏ )వి. సునీత, సెంట్రల్ తహసిల్దార్ వెంకట రామయ్య, నార్త్ తహసిల్దార్ సూర్యారావు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు గాంధీ నగర్ ఆరిఫ్, పటమట రేవంత్, గుణదల నందీశ్వర రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు, మోహన్ బాబు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News