మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే మే నెల 2 వ తేదీన ప్రధానమంత్రి గన్నవరం విమానాశ్రయానికి విచ్చేయుచున్న సందర్భంగా అన్ని రకాల పనులు, ఏర్పాట్లు ఈనెల 28వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర కార్యక్రమ నోడల్ అధికారి, రాష్ట్ర ఆరోగ్యము కుటుంబ సంక్షేమ కమిషనర్ వీర పాండ్యన్ అధికారులను ఆదేశించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే మే నెల 2 వ తేదీన అమరావతిలో రాజధాని పునః నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వస్తున్న దృష్ట్యా రాష్ట్ర కార్యక్రమ నోడల్ అధికారి, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో చుట్టూ కలియతిరిగి ముందస్తు భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. తొలుత వారు అంతర్జాతీయ టెర్మినల్ వద్ద విఐపి విరామశాల, ఆగమనం, నిర్గమన ప్రదేశాలు పరిశీలించారు.
అనంతరం రాష్ట్ర నోడల్ అధికారి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ లతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నోడల్ అధికారి మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన ఎస్పీజీ వారు రానున్నారని వారు ఆ రోజు సాయంత్రం అధికారులందరితో సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షిస్తారన్నారు. ఆలోగా జిల్లా కలెక్టర్ ఎవరికి అప్పగించిన పనులు, ఏర్పాట్లు అని కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. విమానం దిగాక ప్రధానమంత్రి పర్యటించే మార్గంలో ఎలాంటి రాకపోకలు కానీ నిర్మాణాలు గానీ లేకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి కొంత సమయం విమానాశ్రయంలో గడిపే అవకాశం ఉన్నందున అందరూ కూడా అప్రమత్తంగా ఉండి కావలసిన ఏర్పాట్లు అన్ని జాగ్రత్తగా చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ నోడల్ అధికారికి వివరిస్తూ ప్రధానమంత్రికి అత్యవసర వైద్యం అందించేందుకు అంబులెన్స్, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, సిద్ధార్థ కళాశాలలో ఆసుపత్రికి కావలసిన ఏర్పాట్లు చేయాలని, 10 ఫైర్ టెండర్లు అందుబాటులో ఉంచుకోవాలని, సురక్షిత ఆహారం జాగ్రత్తగా పరీక్షించుటకు బృందాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించామన్నారు. ప్రజలను తరలించేందు కోసం కావలసినన్ని బస్సులను సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు. రానున్న ప్రముఖులను తీసుకుని వెళ్లేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చాలని డిటిసికి సూచించామన్నారు. అల్పాహారము, కావలసినంత ఇంధనము, గ్రీన్ రూములు, అంతర్జాల సౌకర్యం, పిఎంఓ సెటప్ తదితర ఏర్పాట్లు గతంలో మాదిరిగా అన్ని జాగ్రత్తగా చేస్తున్నామనీ రాష్ట్ర నోడల్ అధికారికి వివరించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విమానాశ్రయంలోనూ ప్రధానమంత్రి పర్యటించే మార్గంలో అంతట కట్టుదిట్టమైన భద్రత ప్రణాళికను రూపొందించామన్నారు. కాన్వాయ్ వాహనాలు సజావుగా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చేl హెలికాప్టర్లకు ఇంధనం నింపే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రముఖుల భద్రత కోసం 8 మంది డిఎస్పీలను, ఇద్దరు అడిషనల్ ఎస్పి తో పాటు తాను బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షిస్తామన్నారు. బందోబస్తు లో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు ఉంటాయన్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి విజయవాడకు మీదుగా అమరావతికి వెళ్లేందుకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామన్నారు. బయట ప్రాంతాల నుండి వచ్చే వాహనాలను ప్రధాన రహదారి లోకి కాకుండా వేరే మార్గాల్లో దారి మళ్ళిస్తున్నామన్నారు. వాహనాల పార్కింగ్ కోసం అని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో విమానాశ్రయం డైరెక్టర్ ఎం ఎల్ కె రెడ్డి, గుడివాడ మచిలీపట్నం ఉయ్యూరు ఆర్డిఓలు బాలసుబ్రమణ్యం స్వాతి, హేలా షారోన్, డ్వామా,డి ఆర్ డి ఏ పి డి లు శివప్రసాద్, హరిహర నాథ్, డిపిఓ అరుణ, జిల్లా అగ్గిమాపక అధికారి ఏసురత్నం, ఆర్టీవో శ్రీనివాస్, డీఎఫ్ఓ సునీత, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ నటరాజు, ఆర్ అండ్ బి ఇంజనీర్ లోకేష్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ శర్మిష్ట, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు,గన్నవరం డిఎస్పి శ్రీనివాసరావు, గన్నవరం ఉయ్యూరు తహసిల్దార్లు శివయ్య, సురేష్ కుమార్ ఆక్టోపస్ కమాండోలు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News