Breaking News

Daily Archives: March 19, 2025

మహిళలకు రక్షణ పోష్ చట్టం గురించి అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పనిచేసే ప్రదేశలలో లైంగిక వేధింపుల నుండి మహిళలకు రక్షణ పోష్ (POSH) చట్టం గురించి వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో అవగాహన సదస్సును ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ నిర్వహించారు. ఈ సంధర్భం గా పోలీసు కమిషనర్మాట్లాడుతూ… పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు అనేది చిన్న విషయం కాదు దీన్ని ఈజీగా తీసుకోకూడదు. ఈ విషయంలో మహిళలు మౌనంగా ఉండకుండా నిర్భయంగా ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని దానికోసం పోషె …

Read More »

ఢిల్లీలో బిల్ గేట్స్ తో ఏపి సిఎం చంద్రబాబు భేటీ

-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం -ఆరోగ్య, వ్యవసాయ, విద్య రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం -బిల్ గేట్స్ ను రాష్ట్రానికి ఆహ్వానించి ముఖ్యమంత్రి చంద్రబాబు న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం చేసుకుంది. పరిపాలనతో పాటు వివిధ శాఖల్లో టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలను అమలు చేయడానికి అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఖర్చు తగ్గింపు, ఉపాధి కల్పన …

Read More »

ఢిల్లీలో 4 వ జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీ (NSAC) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిథ్యం వహించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..

-భారత్ మారిటైమ్ రంగ అభివృద్ధి కోసం తీరప్రాంత రాష్ట్రాలను ఏకం చేయడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.. -నరేంద్ర మోదీ నాయకత్వంలో మౌలిక సదుపాయాల కల్పన, మారిటైమ్ రంగంలో వృద్ధితో భారత్ గ్లోబల్ మారిటైమ్ పవర్ హౌస్ గా రూపాంతరం చెందనుంది. -స్వర్ణ ఆంధ్ర @ 2047 ద్వారా భారత్ మారిటైమ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.. -చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఏపీ మారిటైమ్ రంగం అభివృద్ధికి అనేక కీలకమైన చర్యలు చేపట్టాం.. -రూ. …

Read More »

స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి తానా అధికారిక ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఆధ్వర్యంలో జులై 3 నుండి 5 వరకు అమెరికా మిషిగాన్ రాష్ట్రం, నోవీ నగరంలోని శుభర్బన్ కలెక్షన్ షోప్లేస్ వేదికగా 24వ తానా మహాసభలు నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు తానా ప్రతినిధులు ఆయన్ను అసెంబ్లీలో స్పీకర్ చాంబర్ లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తానా కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ నాదెళ్ళ గంగాధర్‌, మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి, కాన్ఫరెన్స్‌ డైరెక్టర్‌ సునీల్‌ …

Read More »

ప్రపంచమే గర్వించదగ్గ వ్యక్తి సున్నిత విలియమ్స్

-ప్రశంసించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచమే గర్వించే విధంగా అంకితభావంతో ఆసయ సాధనకు 286 రోజులు అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా ముగించి ఈ తెల్లవారుజామున భూమికి సురక్షితంగా చేరుకున్న సునీతా విలియమ్స్ కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందనలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వ్యోమగామి యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకమని, అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఆమె పరిశోధనలు ఈ ప్రపంచానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తాయన్నారు. శాస్త్రీయ పరిశోధన పట్ల …

Read More »

జిల్లా కన్సల్టేటీవ్ కమిటీ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రజల జీవనోపాదులను మెరుగుపర్చి పేదరికాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాలకు, పరిశ్రమల ప్రోత్సాహానికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేసి ఆర్ధిక అభివృధ్ది రేటులో జిల్లాను ముందంజలో ఉండేలా బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధ్యక్షతన డిసెంబరు త్రైమాసికంకు సంబంధించిన జిల్లా కన్సల్టేటీవ్ కమిటీ సమావేశం …

Read More »

రీసర్వే ప్రక్రియ తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సంయుక్త కలెక్టర్, గుంటూరు A.భార్గవ్ తేజ IAS వారు రీసర్వే ప్రక్రియ తనిఖీ లో భాగంగా పొన్నూరు మండలం నందు రీసర్వే పైలేట్ ప్రాజెక్టు క్రింద చేపట్టిన వల్లభరావుపాలెo గ్రామమును సందర్శించారు. ప్రభుత్వ భూముల సరిహద్దుల రీసర్వేలో భాగముగా బ్లాకు నెం.10లోని సర్వే నెం.430 సరిహద్దులను రోవర్ల ద్వారా తిరిగి నిర్ధారించే క్రమమును పరిశీలించారు. మరియు బ్లాకు నెం.4లోని సర్వే నెం.127 నందలి య.7.63 సెంట్లు విస్తీర్ణము గల లాంగ్ నారోఫీల్డ్ లను రోవర్ల ద్వారా …

Read More »

సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొల్లిపర మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి  ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో ఇన్ అండ్  అవుట్ పేషెంట్ల నమోదు వివరాల రిజిస్టర్లను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోని పలు విభాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గర్భవతులకు సంబంధించి అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేసి వారికి అందుతున్న చికిత్స వివరాలను …

Read More »

పదవ తరగతి పరీక్షలను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొల్లిపర లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కేంద్రంలో 224 మంది విద్యార్దులకు గాను వంద శాతం పరీక్షలకు హాజరైనారని మండల విద్యాశాఖాధికారి కె.ఝాన్సీ లత జిల్లా కలెక్టర్ కు వివరించారు. పరీక్షలు వ్రాస్తున్న విద్యార్దులకు కల్పించిన మౌలిక సదుపాయాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ సూచనలు జారీ చేసారు. విద్యార్దులకు …

Read More »

ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనాలి…

-క్రికెట్ తో పాటు వాలీబాల్ పోటీలు నిర్వహించాలి. -మెగా కార్పొరేట్ క్రికెట్ టి 20 లీగ్ 2025. విజేత పోలీసు జట్టు -జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.ఎస్. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరు ఆటల పోటీలలో పాల్గొనడం వల్ల ఓత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎస్ వి తారకరామ స్టేడియం నందు ఈ నెల 8 నుండి నిర్వహించిన మెగా కార్పొరేట్ క్రికెట్ టి 20 లీగ్ …

Read More »