Breaking News

Daily Archives: March 31, 2025

జిల్లాలో 2,28,813 పెన్ష‌న్ల‌కు రూ. 98.11 కోట్లు విడుద‌ల

– పేద‌ల సేవ‌లో స్ఫూర్తికి అనుగుణంగా పంపిణీ చేప‌ట్టండి – క్షేత్ర‌స్థాయిలో నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ త‌ప్ప‌నిస‌రి: క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీన ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల కింద 2,28,813 పెన్ష‌న్ల‌కు దాదాపు రూ. 98.11 కోట్లు పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని.. క్షేత్ర‌స్థాయిలో అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఇళ్ల వద్ద పెన్ష‌న్ల పంపిణీ స‌జావుగా సాగేలా కృషిచేయాల‌న్నారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. డీఆర్‌డీఏ పీడీ, ఆర్‌డీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలతో ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల …

Read More »

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేసేలా కార్యాచరణ

-ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ చర్చలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సోమవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చర్చలు జరిపింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్యాకేజీని మంజూరు చేసిన తర్వాత తదనంతర పరిణామాలపైనా, తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశంలో పాల్గొన్న …

Read More »

బహుభాషల అధ్యయనం ఎంతో మేలు

-సిలికానాంధ్ర ఉగాది వేడుకల్లో యార్లగడ్డ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న భాషలు నేర్చుకోవడం వ్యక్తిగతంగా ఎంతో ప్రయోజనకరమని, దానివల్ల భాషకు ప్రత్యేకమైన ప్రయోజనం ఉండబోదని విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. అమెరికా బే ఏరియాలో సిలికానాంధ్ర నిర్వహించిన ఉగాది వేడుకల్లో యార్లగడ్డ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రం జాతీయ ఐక్యతకు సహాయ పడుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ ప్రతిపాదనలో హిందీని తప్పనిసరి …

Read More »

సూపర్ స్పెషాలిటీలో ఖాళీగా ఉన్న‌ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల్లో 25 శాతం భర్తీ

-స్పెషల్ డ్రైవ్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా 41 మంది నియామ‌కం -వచ్చే వారం ఇదే విధంగా అసోసియేట్ ప్రొఫెసర్లు మరియు ప్రొఫెసర్ల నియామకం -సూపర్ స్పెషాలిటీలో 50 శాతం ఖాళీల‌ను స్పెష‌ల్ డ్రైవ్ ద్వారా భ‌ర్తీ చేయాలి -ఆదేశించిన వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 20 ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న సూపర్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి భారీఎత్తున చేపట్టిన ప్రత్యేక నియామక డ్రైవ్ కింద, వివిధ …

Read More »

ఏప్రిల్ 2న రిలయన్స్ సీబీజీ ప్లాంట్ కు శంకుస్థాపన

-పాల్గొననున్న నారా లోకేష్, అనంత్ అంబానీ -ఉపయోగంలేని భూముల వినియోగంతో రైతులకు ఆర్థిక లాభం -రాష్ట్రవ్యాప్తంగా 500 ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళిక -ప్లాంట్ల నిర్మాణంతో… వేలాది మందికి ఉపాధి -ఉద్యోగాల కల్పనతో వలసలు తగ్గుముఖం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రిలయన్స్ ఆధ్వర్యంలో కనిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే మొదటి కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ కు సంబంధించి ఏప్రిల్ 2వ తేదీ జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రిలయన్స్ …

Read More »

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలి

-విద్యార్ధులకు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ పిలుపు -ఆంగ్లభాషతోనే అభివ్రుద్ధి అన్న అపోహను విడనాడాలని హితవు -మాత్రుభాషలో అధ్యయనం చేయాలని సూచించిన మంత్రి -చాట్రగడ్డలో సరస్వతీ విద్యా మందిర్ నూతన భవన నిర్మాణానికి మంత్రి స‌త్య‌కుమార్ శంకుస్థాపన -మాత్రు భాషాభ్యాసంతోనే చైనా, జపాన్ వంటి దేశాలు ఎదిగాయి -విద్యా వ్యవస్థకు అండగా నిలబడే దాత్రుత్వ సంస్క్రుతి మళ్లీ రావాలి రేప‌ల్లె, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్రమోడీ కలలు కంటున్న వికసిత్ భారత్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలు కంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో …

Read More »

నేడు (01.04.2025) యథావిధిగా పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష

-పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు.వి. IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం (01.04.2025) సోషల్ స్టడీస్ పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు.వి. IAS., ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందన్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు సంబంధించిన అందరూ అధికారులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ విషయాన్ని ఆర్జేడీలు, జిల్లా …

Read More »

సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో గ్రాడ్యేషన్ డే వేడుకలు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం‌లోని సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా గ్రాడ్యేషన్ డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం చిన్నారి గ్రాడ్యేట్లకు , వారి గర్వంతో నిండిన తల్లిదండ్రులకు, గురువులకు చిరస్మరణీయంగా నిలిచింది. ప్రీ-ప్రైమరీ విభాగానికి చెందిన కిండర్‌గార్టెన్ విద్యార్థులు నృత్యం, సంగీత ప్రదర్శనలతో తమ ప్రతిభను ఆవిష్కరించారు. వీరి ఆత్మవిశ్వాసం మరియు ప్రతిభను చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్  జి. భారతి, వైస్ ప్రిన్సిపాల్ ఆర్.ఎస్. శెట్టి, సమన్వయకర్తలు ఎం. …

Read More »

20 లక్షల పైగా కార్డుల జారీ: కీలక మైలురాయిని అధిగమించిన టాటా న్యూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు

-కస్టమర్లకు విశిష్టమైన ప్రయోజనాలు, పొదుపులతో తోడ్పాటు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కీలక మైలురాయిని సూచిస్తూ, 20 లక్షల పైగా టాటా న్యూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులను జారీ చేసినట్లు టాటా న్యూ మరియు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించాయి. తద్వారా దేశవ్యాప్తంగా కస్టమర్లకు మరింత విలువను చేకూరుస్తూ, ప్రయోజనాలను అందించడంలో కార్డు విజయవంతమైనట్లు వివరించాయి. 2022 ఆగస్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి, ఈ క్రెడిట్ కార్డు భారతీయ మార్కెట్లో అత్యంత సరళమైన, పారదర్శకమైన రివార్డ్స్ వ్యవస్థను అందించడం ద్వారా వినియోగదారులు మెచ్చిన కార్డుగా …

Read More »

మునాంబం సహా భూ సమస్యలకు వక్ఫ్ చట్ట సవరణ శాశ్వత పరిష్కారాన్ని అందించాలి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత కేంద్ర వక్ఫ్ చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగానికి మరియు దేశ లౌకిక ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయన్నది వాస్తవం. కేరళలోని మునాంబం ప్రాంతంలోని 600 కంటే ఎక్కువ కుటుంబాల పూర్వీకుల నివాస ఆస్తులను వక్ఫ్ భూమిగా ప్రకటించడానికి వక్ఫ్ బోర్డు ఈ నిబంధనలను అమలు చేసింది. గత మూడు సంవత్సరాలుగా, ఈ సమస్య సంక్లిష్టమైన చట్టపరమైన వివాదంగా మారింది. చట్టపరమైన సవరణ మాత్రమే శాశ్వత పరిష్కారాన్ని అందించగలదనేది వాస్తవం, మరియు దీనిని ప్రజాప్రతినిధులు గుర్తించాలి. వక్ఫ్ …

Read More »