Breaking News

Monthly Archives: April 2026

38 పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ వైద్యుల నియామ‌కం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్ఎం) కింద 38 పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ వైద్యుల పోస్టులను వైద్య, ఆరోగ్య శాఖ భర్తీ చేసింది. బోధన, జిల్లా ఆసుపత్రులు, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ కేర్ యూనిట్ల అవసరాల కోసం జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద(అవుట్ సోర్సింగ్‌) విధానంలో భర్తీచేసేందుకు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన నియామక సంస్థ నోటిఫికేషన్ జారీచేసింది. వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు 88 మంది హాజరయ్యారు. వీరిలో 38 మందిని ఎంపికచేశారు. వీరికి త్వరలో వైద్య, ఆరోగ్య శాఖ …

Read More »

గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు

-తాడేపల్లిలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రూప్-1 అధికారులు. -RTOలుగా బాధ్యతలు స్వీకరించిన అధికారులకు మంత్రి అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని 2023 గ్రూప్-1లో విజయం సాధించిన అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్-1 ద్వారా ఎంపికై RTOలుగా నియమితులైన ఆరుగురిని మంత్రి అభినందిస్తూ, తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా నందిపాటి ఎల్.వి. సుబ్బా రెడ్డి, షైక్ …

Read More »

టిడిపికి కొత్త ఊపు…

-లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు – రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రమాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (వర్కింగ్ ప్రెసిడెంట్‌గా) బాధ్యతలు స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ …

Read More »

ఆరుగురు చేనేత ప్రముఖులకు టీడీపీ పదవులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ పదవులు చేనేత వర్గానికి చెందిన ఆరుగురు ప్రముఖులను వరించాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఉదయం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ తోపాటు పార్టీ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసింది. పద్మశాలి సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గుత్తికొండ ధనుంజయ రావు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన …

Read More »

రాయితీతో పన్ను చెల్లింపుకు ఒక్క రోజే గడువు, గురువారం అర్ధరాత్రి 11 గంటల వరకు క్యాష్ కౌంటర్లు అందుబాటులో… : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిల వడ్డీపై 50 శాతం రాయితీ పొందేందుకు గురువారం ఒక్క రోజే గడువు ఉందని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి ప్రకటించిన 5 శాతం రాయితీని నగర ప్రజలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారని, …

Read More »

అభివృద్ధి పనుల పై విభాగాధిపతులతో సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నూతన డ్రైన్ నిర్మాణ పనులు 10 రోజుల్లో, నిర్మాణదశలో ఉన్న డ్రైన్లు 15 రోజుల్లో పూర్తీ చేయాలని, అందుకు ఇంజినీరింగ్ అధికారులదే భాధ్యత అని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి సిఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తో కలిసి విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత కమిషనర్ నగరపాలక సంస్థ చేపడుతున్న అభివృద్ధి …

Read More »

మహిళల ఆర్థిక స్వాలంభనకు స్వయం ఉపాధి కీలకం….

-మహిళలను పారిశ్రామిక వేత్తలను చేయాలన్నదే లక్ష్యం. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థిక స్వాలంభన సుస్థిర భవిష్యత్తుకు స్వయం ఉపాధి మార్గాలు కీలక పాత్ర వహిస్తాయని ప్రతి మహిళలను పారిశ్రామిక వేత్తగా తిర్చిదిద్ది ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అధికారులు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

ఇసుక రీచ్‌లకు టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయండి…..

-ఇసుక సరఫరా విధానాన్ని పారదర్శకంగా అమలు చేయండి.. -నిబంధనలు ఉల్లంగించకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయండి.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక సరఫరాను మరింత సులభతరం చేసేందుకు జిల్లాలో మరో ఐదు ఇసుక రీచ్‌లకు టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఇసుక సరఫరా విధానాన్ని పారదర్శంగా అమలు చేయడంతో పాటు నిబంధనలను ఉల్లంగించకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరా అమలుపై బుధవారం కలెక్టర్ డా. …

Read More »

ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించడం జరిగినప్పటికీ.. నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని సమన్వయ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. …

Read More »

పన్ను వసూళ్ళ ప్రత్యేక డ్రైవ్ లో మొండి బకాయిదారుల ఆస్తులకు జప్తు నోటీసు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి పన్ను మరియు డ్రైనేజి పన్నుల బకాయిలు వసూళ్ళలో భాగంగా మూడు సర్కిళ్ళ పరిధిలో పన్నుల వసూళ్ళ డ్రైవ్ నిర్వహిస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అందులోభాగంగా బుధవారం ఉదయం సర్కిల్ – 1 పరిధిలోని భవానిపురం లో ని బ్యాంకు కాలనీ లోగల 22 ఖాళీ స్థల పన్ను బకాయిదారులకు జప్తు నోటీసు …

Read More »