Breaking News

Daily Archives: July 27, 2026

డ్ల విస్తరణ పనులను నిర్దేశిత ‘రైట్ ఆఫ్ వే’ మేరకు వేగవంతంగా పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలోని బృందావన్ గార్డెన్స్ రోడ్ల విస్తరణ పనులను నిర్దేశిత ‘రైట్ ఆఫ్ వే’ (ఆర్ఓడబ్ల్యు) మేరకు వేగవంతంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులపై పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ తో సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా …

Read More »

స‌ర్‌.. స‌ర్వేలో మీ స‌హ‌కారం భేష్‌!

– మున్ముందు ఇదే స‌హ‌కారాన్ని అందించండి – ఈ నెల 31వ తేదీన ఓట‌ర్ల జాబితా ముసాయిదా ప్ర‌చుర‌ణ‌ – ఈ నెల 31 నుంచి ఆగ‌స్టు 30 వ‌ర‌కు క్లెయిములు, అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌ – ప్ర‌తి ద‌ర‌ఖాస్తును అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ప‌రిష్క‌రిస్తాం – అక్టోబ‌ర్ 3వ తేదీన తుది జాబితా ప్ర‌చుర‌ణ‌ – రాజ‌కీయ పార్టీల స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌) …

Read More »

పీజీఆర్ఎస్‌కు వచ్చే ప్రజల కోసం కలెక్టరేట్‌లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

-సుమారు 130 మందికి ఉచిత వైద్య సేవలు, మందుల పంపిణీ -ఆయుర్వేదం ద్వారా తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. శిబిరంలో ప్రజలకు అందిస్తున్న చికిత్సలు, మందుల పంపిణీ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ …

Read More »

పిజిఆర్ఎస్‌కు విశేష స్పందన

-187 వినతులు స్వీకరణ, వినతుల పరిష్కారంలో ఆలస్యం సహించేది లేదు -పెండింగ్ అర్జీలను వెంటనే డిస్పోజ్ చేయాలి -రైతులకు ఎరువుల సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ – స్పెషల్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలి -ఎన్టీఆర్ జిల్లాకు పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)’ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై …

Read More »

సెప్టెంబర్-2026 లో జీఎన్‌ఎం సప్లిమెంటరీ పరీక్షలు

-డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. ఏ. విష్ణు వర్థన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జీఎన్‌ఎం (General Nursing and Midwifery Examinations September – 2026- GNM) విద్యార్థుల కోసం సెప్టెంబర్-2026 లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్య విద్యా సంచాలకులు డా. ఎ. విష్ణు వర్ధన్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సప్లిమెంటరీ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ పరీక్షలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు …

Read More »

దోమల నిర్మూలనకు విస్తృత యాంటీ మలేరియా ఆపరేషన్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జి డాక్టర్ గోపాల నాయక్ ఆదేశాల మేరకు నగరంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో యాంటీ మలేరియా ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బయాలజిస్ట్ సూర్యనాయక్ ఆధ్వర్యంలో కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో విస్తృత స్థాయిలో యాంటీ లార్వా చర్యలు చేపట్టారు. దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారే ప్రాంతాలను గుర్తించి ఫాగింగ్ నిర్వహించడంతో పాటు, సైడ్ కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారాన్ని …

Read More »

ప్రతి ఫిర్యాదుకు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి శాశ్వత పరిష్కారం అందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు ఆదేశించారు. సోమవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఈ …

Read More »

తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు బ్రాహ్మణులకు కేటాయించాలి…

-వేద విజ్ఞాన పరిషత్ డిమాండ్.. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే సీటుతో పాటు రాష్ట్రంలోని బ్రాహ్మణుల ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాల్లో రాజకీయ పార్టీలన్నీ బ్రాహ్మణ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన చర్చా వేదికలో తీర్మానించారు. తిరుపతిలోని అలిపిరి రోడ్డులో ఉన్న దివ్యరామం సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్టీఓ సుబ్రహ్మణ్యం, డాక్టర్ స్వరాజ్యలక్షి, డాక్టర్ అర్చన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా …

Read More »

27వ తేదీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 28 జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్…

-33% మహిళా రిజర్వేషన్ లో బిసి మహిళలకు సబ్ కోటా కేటాయించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంట్ ఆమోదంతో నిమిత్తం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసింది దానికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్ లో బిసి మహిళలకు సబ్ కోట కేటాయించాలి అని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ గార్లకు రిపజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో కలెక్టర్ లక్ష్మిశని …

Read More »

విద్యార్థుల సామర్థ్యాల పెంపు, క్రమబద్ధమైన అధ్యయనం, నిరంతర పునశ్చరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజి -ప్రతి విద్యార్థి పురోగతిని వ్యక్తిగతంగా పర్యవేక్షించి ఉత్తీర్ణత శాతం పెంచాలి పునాదిపాడు (కంకిపాడు మండలం), నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల సామర్థ్యాల పెంపు, క్రమబద్ధమైన అధ్యయనం, నిరంతర పునశ్చరణపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే విద్యా ప్రమాణాలు మెరుగుపడి ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు. సోమవారం కంకిపాడు మండలంలోని పునాదిపాడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన ఆయన, ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాల విద్యా పనితీరు, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు, పదో తరగతి ఫలితాలను సమీక్షించి …

Read More »