విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాదిలో తొలి ఏకాదశిని మొదటి పండుగగా భావిస్తారు. దీంతో 2026లో తొలి ఏకాదశితో పండుగలు ప్రారంభమయ్యాయని పురోహితులు తెలిపారు. ఈనెల 29న గురు పూర్ణిమ, AUG 18న మంగళ గౌరీ పూజ, 21న వరలక్ష్మీ వ్రతం, 28న రాఖీ పౌర్ణమి జరగనున్నాయి. అలాగే SEP 4న శ్రీకృష్ణాష్టమి, 14న వినాయక చవితి, OCT 20న దసరా, NOV 8న దీపావళి, DEC 20న ముక్కోటి ఏకాదశి పండుగలను జరుపుకోవాలని సూచించారు.
Read More »Daily Archives: July 27, 2026
యువతకు స్ఫూర్తి, భారత రత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం… : ఎమ్. ఎస్ బేగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, మిస్సైల్ మ్యాన్, భారత రత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా విజయవాడలోని ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీ నందు ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కలాం దేశాభివృద్ధి దృక్పథం, విజ్ఞాన శాస్త్రానికి చేసిన అపూర్వ సేవలు, యువతకు అందించిన స్ఫూర్తిదాయక సందేశాల గురించి వివరించారు. కలలు కనండి, ఆ కలలను నిజం చేసుకునే వరకు ఆగకండి …
Read More »పాఠశాలలు, హాస్టళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ఎంపీ గురుమూర్తి లేఖకు కేంద్రం స్పందన
-రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదిక ఆధారంగానే వివరాలు వెల్లడించిన కేంద్రం -క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్య న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు సురక్షితమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన పరిశుభ్రత వంటి అంశాలపై తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై ఎంపీ చేసిన సూచనలను పరిశీలించిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాష్ట్ర ప్రభుత్వానికి వాటిని …
Read More »నెల్లూరు–చెన్నై జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలి
-తిరుపతి పార్లమెంటు పరిధిలోని కీలక రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలి -లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత కీలకమైన రహదారి ప్రాజెక్టులను తక్షణమే చేపట్టాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాళహస్తి–తడ, గూడూరు–రాపూరు–రాజంపేట, ఊతుకొట–సత్యవేడు–తడ రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మూడు రహదారులు తిరుపతి …
Read More »రైతులకు రూ.5 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి.. కేంద్రం వెల్లడి
-జిల్లాల వారీగా కేసీసీ జారీ, రుణాల పంపిణీ వివరాలను పార్లమెంట్‌కు సమర్పించిన కేంద్ర ప్రభుత్వం -కిసాన్ క్రెడిట్ కార్డులపై లోక్ సభ లో ఎంపీ కేసినేని చిన్ని కీలక ప్రశ్న -లోక్‌సభలో విజయవాడ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (KCC) జారీ, వాటి ద్వారా అందుతున్న పంట రుణాలు, సత్వర రుణ చెల్లింపు ప్రోత్సాహకాలు (Prompt Repayment …
Read More »ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా ఎంపీ చిన్ని
-ఈఎస్ఐ ఆసుపత్రిని 300 పడకల తృతీయ స్థాయి వైద్యశాలగా మరియు ఈఎస్ఐసీ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఎంపీ చిన్ని విజ్ఞప్తి -ఇటీవల ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలు సిబ్బంది అవసరాలపై చర్చించిన ఎంపీ చిన్ని -ఆసుపత్రిలో చర్చించిన అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టత తెస్తానని హామీ -ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర మంత్రి మన్సుఖ్ మండవియా ని కలిసి ఈఎస్ఐ ఆసుపత్రి ని 300 పడకల తృతీయ స్థాయి వైద్యశాల మరియు వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ చిన్ని …
Read More »భవిత్ సేవలు అభినందనీయం
-సామాజిక సేవకులు, సీ బి ఆర్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సీ బీ ఆర్ ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తు కోసం పాటుపడుతున్న భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సేవలు అభినందనీయమని ప్రముఖ సామాజిక సేవకులు, సీ బి ఆర్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సీ బీ ఆర్ ప్రసాద్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అన్నారు. సోమవారం భవానిపురం, …
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్
-బీ జే పీ స్పోక్ పర్సన్ కనుమూరు రవిచంద్ర రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’ కు విశేష స్పందన లభిస్తోందని బీజేపీ స్పోక్ పర్సన్ కనుమూరు రవిచంద్ర రెడ్డి అన్నారు. సోమవారం, భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో బీ జే పీ స్పోక్ పర్సన్ కనుమూరు రవిచంద్ర రెడ్డి,కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ …
Read More »నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్నిసమర్థవంతంగా అమలు చేయడానికి పటిష్టమైన ప్రణాళిక సిద్దం చేశామని, నగర ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు ప్రజారోగ్యానికి భంగం కల్గించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదంకు సహకరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. ఆగస్ట్ 15 నుండి గుంటూరు నగరంలో అమలు చేయనున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం పై అవగాహన కల్గించడానికి, శాఖలు, …
Read More »ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు వీధి …
Read More »
Prajavartha Online Telugu News