-ఆగస్టు 10న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ -కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో అందుబాటులో అధికారులు -అర్జీదారులు సేవలు పొందిన వెంటనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చ -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం, ఆగస్టు 10వ తేదీన ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు …
Read More »Monthly Archives: August 2026
సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ‘మార్పు కావాలి – మార్పు రావాలి’
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త పేట సాయిరామ్ దియేటర్ నుండి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో జాతీయ పార్టీ పిలుపు లో భాగంగా ‘మార్పు కావాలి – మార్పు రావాలి’ అనే నినాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సిపిఐ పాదయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు కామ్రేడ్ డాక్టర్ కే. నారాయణ, పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి …
Read More »పుస్తకాలతో స్నేహం-విజ్ఞానంతో వికాసం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ఆదివారం జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పుస్తక పఠనం పుస్తక ల ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి రమాదేవి మాట్లాడుతూ పుస్తకాలు మనిషికి మంచి మిత్రులు పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం, ఆలోచన శక్తి, సృజనాత్మకత మరియు వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయి అని తెలిపారు. తలదించి నన్ను చూడు… నువ్వు తల ఎత్తుకునేలా చేస్తాను అంటుంది పుస్తకం. కాబట్టి విద్యార్థులు రోజులో …
Read More »“సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, “సుజనా ఫౌండేషన్” ద్వారా ప్రతి శని, ఆదివారలలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. 47వ డివిజన్, సర్కిల్ వన్ కార్యాలయం వద్ద ఆదివారం కూడా నిర్వహించిన “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు , ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ రే, …
Read More »చంద్రబాబు నాయకత్వంలోనే ఆదివాసీల అభ్యున్నతి సాధ్యం: ఎంపీ కేశినేని చిన్ని
-చివరి గిరిజన గూడెం వరకు అభివృద్ధే స్వర్ణాంధ్ర లక్ష్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీలు కేవలం అడవుల్లో నివసించే ప్రజలు కాదని, నేల, నీరు, ప్రకృతితో వేల ఏళ్లుగా అనుబంధం కలిగిన మూలవాసుల వారసులని చిన్ని పేర్కొన్నారు. “వారి …
Read More »“దేవస్థాన అభివృద్ధికి అండగా ఉంటా..!”
-“శ్రీ నగరాల సీతారామస్వామి–శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన నూతన కమిటీకి ఎంపీ కేశినేని చిన్ని శుభాకాంక్షలు” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వన్‌టౌన్‌లోని శ్రీ నగరాల సీతారామస్వామి–శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన నూతన కమిటీకి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పోతిన భేషు, కంటేశ్వరుడు అధ్యక్షతన ఏకగ్రీవంగా ఏర్పడిన నూతన కమిటీ సభ్యులు,ఎంపీ కార్యాలయంలో ఎంపీ చిన్ని ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఎంపీ చిన్ని ఆశీర్వదిస్తూ.. దేవస్థానం అభివృద్ధికి తన …
Read More »జక్కులనెక్కలంలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన పీసీ వాల్, సీసీ డ్రైన్లు, కల్వర్టులు, సిమెంట్ రోడ్ల ప్రారంభం -జక్కులనెక్కలం గ్రామంలో ఇప్పటి వరకు రూ.1.43 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే -హైవే – జక్కులనెక్కలం బీటీ రోడ్డుకు రూ.1.26 కోట్లు మంజూరు.. త్వరలో పనులు ప్రారంభం -గ్రామంలో 474 మందికి ఇంటి వద్దే ఉచిత రక్త పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం -గత ఐదేళ్లలో జరగని అభివృద్ధి రెండేళ్లలో చేసి చూపించా : ఎమ్మెల్యే -రెండేళ్లలోనే జక్కులనెక్కలం గ్రామాన్ని ఏడు సార్లు సందర్శించాను: యార్లగడ్డ -ప్రజల …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..
-కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 10వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి… : మోర్ల ఏడుకొండలు గౌడ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బహుజన వీరుడు గోల్కొండ కోటను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతిని ఆగస్టు 18 ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జై గౌడ సేన జాతీయ అధ్యక్షుడు మోర్ల ఏడుకొండలు గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ వేదికగా నిర్వహించిన బహుజన సర్దారులు సర్వాయి పాపన్న, గౌతు లచ్చన్నల జయంతి వేడుకల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మోర్ల ఏడుకొండలు గౌడ్ మాట్లాడుతూ… తమ డిమాండ్లను తెలిపారు. అధికారిక వేడుకలు …
Read More »బీసీలకు తక్షణమే రక్షణ చట్టాలు అమలు చేయాలి… : లాకా వెంగళరావు యాదవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాతీయ లాకా వెంగళరావు యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీనగర్ ఆలపాటీ ఫంక్షన్ హాల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో బీసీ లకు 34 శాతం ఇచ్చారు. 24 శాతానికి కుదించారు. …
Read More »
Prajavartha Online Telugu News