అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించ తలపట్టిన ప్లీనరీ కోసం శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేపట్టారు. మార్చి 12, 13, 14 తేదీలలో జరిగే ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రానున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ, సౌకర్యాల కల్పనకు అనువుగా ఉండే విధంగా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సభకు వచ్చే పార్టీ శ్రేణులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆదివారం పిఠాపురం నియోజకవర్గం పరిధిలో పలు స్థలాలను పరిశీలించారు. హరిప్రసాద్ తోపాటు కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పిఠాపురం ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పార్టీ నేతలు వై శ్రీనివాస్, మురాలశెట్టి సునీల్ కుమార్, చక్రవర్తి, డా.పిల్లా శ్రీధర్, తెలగంశెట్టి వెంకటేశ్వర రావు, రావాడ నాగు, తలాటం సత్య, సతీష్, శివశంకర్, తుమ్మలపల్లి చందు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News