Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం”

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం” లో వచ్చిన అర్జీల పరిష్కారంలో గడువు దాటిన అర్జీలపై, పెండింగ్ కోర్టు కేసులపై దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో పెండింగ్ అర్జీలపై జాయింట్ కలెక్టర్ సమీక్షిస్తూ గడువు దాటేదాకా ఉండకూడదని, గడువులోగానే అర్జీలు పరిష్కరించాలన్నారు. వివిధ శాఖలలో పెండింగ్ కోర్టు కేసులు సమీక్షిస్తూ కోర్టు తుది ఆదేశాలు అమలు పరచక పోవడంతో కోర్టు ధిక్కరణ కేసులు పడుతున్నాయని, ఆ విధంగా జరగకుండా పెండింగ్ కోర్టు కేసులపై దృష్టి సారించాలన్నారు. కోర్టు ధిక్కరణ కేసులలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు సమీక్షించి, కోర్టు ఆదేశాలు సకాలంలో అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇస్తుందని, వాటిని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించుటకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. యువ ఓటర్లకు ఫోటో ఓటర్ కార్డుల పంపిణీ, వృద్ధ ఓటర్లను సన్మానించడం, కళాశాల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించి ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఓటర్లను చైతన్యవంతం చేయాలని అన్నారు.

ఈనెల 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ వారి ప్రసంగపాటం సిద్ధం చేయాలని, వివిధ శాఖలలో ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించుటకు పేర్లు వెంటనే పంపాలని అధికారులకు సూచించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ కుష్టు వ్యాధి విభాగం ద్వారా కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం పై ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలను జాయింట్ కలెక్టర్ విడుదల చేశారు.

జిల్లాలో కుష్టు వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ఇంటింటి సర్వే ఈరోజు నుండి ప్రారంభించి ఫిబ్రవరి 2 వరకు నిర్వహిస్తున్నట్లు, వివిధ శాఖల అధికారులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్ శర్మిష్ట తెలిపారు.

మీకోసం అర్జీలలో..

బాపులపాడు మండలం ఓగిరాల గ్రామంలో తాగునీరు కలుషితం, మంచినీటి పథకం ఫిల్టర్ రిపేర్ చేయించాలని కొలువురు గ్రామస్తులు గ్రామపంచాయతీ సభ్యులు అర్జీ సమర్పించారు.

గురజాడ గ్రామంలో జాతీయ రహదారి విస్తరణ రెండవ దశలో సేకరించిన తన భూమికి నష్టపరిహారం ఇంతవరకు అందలేదని, ఇప్పించాలని కోరుతూ పిసికే ప్రసాద్ తదితరులు అర్జీ సమర్పించారు.

మొవ్వ మండలం పెదపూడి గ్రామానికి చెందిన పెదపూడి శ్రీనివాసరావు తనకు పిత్రార్జితంగా సంక్రమించిన భూమికి పట్టాదారు పాసుబుక్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామానికి చెందిన గాదం నాగేశ్వరరావు తన స్వార్జిత భూమిని రెవిన్యూ రికార్డుల్లో నమోదు చేయించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.

బందరు ఆర్డిఓ కే స్వాతి, సివిల్ సప్లై డిఎం పద్మాదేవి, మెప్మా పిడి సాయిబాబు జాయింట్ కలెక్టర్ తో పాటు మీకోసం లో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

జడ్పీ సీఈవో కె కన్నమనాయుడు, పంచాయతీరాజ్ ఎస్ఇ రమణ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, డ్వామా పిడి కె.వి శివప్రసాద్ యాదవ్, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.పద్మావతి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *