Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 185 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీవోలు తాసిల్దారులు, ఎంపిడిఓ లు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీ జి ఆర్ ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలి అని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ తో పాటు డి ఆర్ ఓ నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, సుధారాణి, రోజ్ మాoడ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు : రెవెన్యూ -122, హౌసింగ్ -1, నీటిపారుదల శాఖ -1, ఎస్సీ కార్పొరేషన్ -2, పంచాయతీరాజ్ -8, హెల్త్ -1, సెర్ప్ – 5, పోలీస్ -9, రూరల్ డెవలప్మెంట్ -2, సర్వే -4, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ -13, టీటీడీ -1, విద్యుత్ శాఖ -2, సివిల్ సప్లైస్ -5, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ -1, రిజిస్ట్రేషన్ శాఖ -2, పశుసంవర్ధక శాఖ-1, ఆర్ అండ్ బి-1, పబ్లిక్ హెల్త్-1, వికలాంగుల సంక్షేమ శాఖ -1, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్-1, – 1, అంబేద్కర్ యూనివర్సిటీ-1, వెరసి మొత్తం 185 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరు వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *